SRI KVST VASANTHOTSAVAM FROM MAY 29-31 _ మే 29 నుండి 31వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

Tirupati, 28 May 2021: TTD will be organising annual Vasantothsavams at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram from May 29 to 31 in Ekantam under Covid guidelines.

As part of the celebrations, Snapana thirumanjanam fete will be performed for the utsava idols of Sri Venkateswara and His two consorts on the first two days and on last day Sri Sita Lakshmana Anjaneya sameta Sri Ramachandramurty and Sri Krishna and His consorts will also be offered Snapana Tirumanjanam.

The significance of the festival is the worship of the Utsava idols with seasonal fruits, flowers and aromatic leaves in the autumn says Archakas.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 29 నుండి 31వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి, 2021 మే 28: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 29 నుండి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ప్రతి రోజూ మ‌ధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ఉత్సవర్ల‌ను ఆలయంలోని ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతాలక్ష్మణ ఆంజ‌నేయ‌స్వామి సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివార్ల‌ ఉత్సవమూర్తులను ముఖ‌ మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆస్థానం నిర్వహిస్తారు.

వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం అని అర్చ‌కులు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.