SRI LANKAN PM OFFERS PRAYERS_ శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే

Tirumala, 3 August 2018: Sri Lankan Prime Minister Sri Ranil Wikramasinghe accompanied by Spouse Prof Mrs. Maithree Wickramasinghe offered prayers in the temple of Lord Venkateswara on Friday.

After darshan of Lord, he was rendered Vedasirvachanam in Ranganayakula Mandapam. Tirumala JEO Sri KS Sreenivasa Raju presented Teertha Prasadams to the foreign dignitary.

AP Minister Sri Sujay Krishna Rangarao, DIG Sri Prabhakara Rao, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, Reception Officials Sri Balaji, Sri Lokanadham, VGO Sri Ravinder Reddy and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే

ఆగస్టు 03, తిరుమల 2018: శ్రీలంక ప్రధాన మంత్రి గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే తన సతీమణి ప్రొఫెసర్‌ మైత్రి విక్రమసింఘేతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధాని దంపతులకు టిటిడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను గౌ|| శ్రీలంక ప్రధాని దంపతులకు అందించారు.

అనంతరం గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే మీడియాతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి అధికారులు చక్కటి దర్శన ఏర్పాట్లు చేశారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ సుజయకృష్ణ రంగారావు, టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, రిసెప్షన్‌ డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి, శ్రీ ఇ.సి.శ్రీధర్‌, ఓఎస్‌డి శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.