SRI PAT RADHASAPTHAMI VAHANAMS_ ఫిబ్రవరి 12న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

Tirupati 7 Feb. 19: In the famous temple of Goddess Padmavathi Devi in Tiruchanoor, seven vahana sevas takes place from morning till night on February 12 on the occasion of Radhasapthami.

The day commences with surya prabha sahanam between 7am and 8 am followed by Hamsa Sahanam between 8.30 am and 9.30 am.

Later Aswa Vahanam will be observed between 10 am and 11 am followed by Garuda Vahanam between 11.30 am and 12.30 pm. The daylight vahanams concludes with Chinna Sesha Vahanam between 1pm and 2 pm.

While in the evening Chandra prabha Vahanam takes place between 6pm and 7pm and last vahanam, Gaja between 8.30pm and 9.30pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఫిబ్రవరి 12న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

తిరుపతి, 2019 ఫిబ్రవరి 07: ఫిబ్రవరి 12వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి పర్వదినాన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వాహనసేవల వివరాలు

సమయం వాహనం

ఉ. 7.00 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం

ఉ. 8.30 – ఉ. 9.30 హంస వాహనం

ఉ. 10.00 – ఉ. 11.00 అశ్వ వాహనం

ఉ. 11.30 – మ. 12.30 గరుడ వాహనం

మ. 1.00 – మ. 2.00 చిన్నశేష వాహనం

సా. 6.00 – రా. 7.00 చంద్రప్రభ వాహనం

రా. 8.30 – రా. 9.30 గజ వాహనం

కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, ఊంజలసేవ, సాయంత్రం బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.