SRIVARI DARSHAN FOR AGED, HANDICAPPED ETC ON FEB 19 AND 20_ ఫిబ్రవరి 19న వృద్ధులు, దివ్యాంగులకు, 20న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
Tirumala, Feb 13,2019: As part of its agenda to provide smooth and hassle free darshan for aged, handicapped and parents with below 5 years kids the TTD has organised special darshan for them on February 19 and 20.
TTD plans to issue 4000 tokens on February 19 to all the three category of devotees in three slots-1000 tokens in 10am slot, 2000 tokens in 2pm slot and 1000 in 3pm slot.
TTD has appealed to all such devotees to visit Tirumala on above dates and beget good darshan of Lord. The TTD is daily issuing 1400 tokens for the aged in two slots from 7am and beget Srivari darshan in two-time slots-10am and 3pm.
On February 20, the parents with below 5 year kids will be given darshan in two time slots of 9am and 1.30 pm. During regular days parents with 1-year-old kids are given Srivari darshan through Supatham route. On demand from devotees on these two dates also such devotees with 5-year-old kids will be given entry through Supatham route.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 19న వృద్ధులు, దివ్యాంగులకు, 20న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
తిరుమల, 2019, ఫిబ్రవరి 13: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.
ఇందులోభాగంగా ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.
5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.