SRIVARU AS MOHINI CHARM DEVOTEES DURING SAHASRA DEEPALANKARA SEVA _ సహస్రదీపాలంకార సేవలో మోహినీ అలంకారంలో శ్రీనివాసుని కటాక్షం- భక్తుల తన్మయత్వం

Nellore, 17 August 2022: As a part of the ongoing Sri Venkateswara Vaibhavotsavams, on the second day evening on Wednesday, Srivaru decked as the Universal Celestial Beauty, “Mohini” cheered devotees during the Sahasra Deepalankara Seva.

Draped in a white with red border Pattu silks and decorated with dazzling ornaments, Srivaru as Mohini appeared on the finely decked swing, where Unjal Seva was performed.

Renowned musician Sri Madhusudhan Rao presented a few popular Annamacharya Sankeertans while Smt Lavanya presented a couple of Sri Purandhara Dasa Sankeertans on the occasion which mesmerized the denizens who thronged the AC Subba Reddy stadium to get the Darshan of Sri Venkateswara Swamy.

After the Unjal Seva, Veedhi Utsavam was performed.

Rajyasabha MP Sri Vemireddi Prabhakar Reddy, LAC Chief of New Delhi Smt Prasanthi Reddy, and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 సహస్రదీపాలంకార సేవలో మోహినీ అలంకారంలో శ్రీనివాసుని కటాక్షం – భక్తుల తన్మయత్వం

నెల్లూరు, 2022, ఆగస్టు 17 ;నెల్లూరులో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో మోహినీ అలంకారంలో శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామివారి వైభవాన్ని దర్శించి తన్మయత్వం చెందారు. చల్లటి సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు. నిత్యం అవిశ్రాంతంగా భక్తులకు దర్శనభాగ్యాన్ని ప్రసాదించే స్వామివారు సహస్రదీపాలంకార సేవతో సేద తీరుతారు.

ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత  టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి.మధుసూదనరావు, శ్రీమతి జి.లావణ్య బృందం పలు అన్నమయ్య సంకీర్తనలు, పురందరదాస కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఇందులో ‘గోవింద గోవిందయని కొలువరే…, హరీ నీ ప్రతాపమునకడ్డమేది లోకమున…., వేదములే నీ నివాసమట విమల నారసింహ…, జగడపు చనువుల జాజర…., అలరచంచలమైన ఆత్మలందుండనీ అలవాటుజేసెనీ ఉయ్యాల…,’ తదితర కీర్తనలున్నాయి. ఆ తరువాత మంగళవాయిద్యంతో వాద్యనీరాజనం సమర్పించారు.

సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు ఏకాంతసేవ జరుగనుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.