SVBC LIVE COVERAGE LAUDED GLOBALLY-SVBC CHAIRMAN _ భక్తులను మరింత ఆకట్టుకునేలా ఎస్వీబీసీ ప్రసారాలు : ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ పృధ్వీరాజ్ బాలిరెడ్డి

Tirumala, 6 October 2019: The live coverage of SVBC programmes during annual brahmotsavams are well received by devotees of Sro Venkateswara Swamy present across the globe,  said,  TTD chairman Sri Pruthviraj Bali Reddy.

Speaking to media persons at Media Centre on Sunday he said the SVBC channel has provided full and vibrant coverage of the Srivari Annual Brahmotsavams to benefit the devotees across the world for nine hours every day without any technical issue.

The SVBC chairman said besides procuring quality software and hardware,  36 HD cameras and three Jimmy jibs for achieving technical excellence. TTD has also roped in talented anchors and commentators at  Nada Niranjanam.

He said the commentary was provided in Telugu, Kannada, Hindi, Tamil and also English for all the vahana sevas and special rituals performed inside the Srivari Temple.

The SVBC chairman said the content of the Brahmotsavams was also uploaded on Twitter, Facebook, and YouTube for devotees’ benefit. He said more revolutionary changes will come which enhance the quality of programmes in the next six months time.

SVBC CEO Sri Venkata Nagesh Kumar was also present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులను మరింత ఆకట్టుకునేలా ఎస్వీబీసీ ప్రసారాలు : ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ పృధ్వీరాజ్ బాలిరెడ్డి

తిరుమల, 2019 అక్టోబ‌రు 06: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మరింత నాణ్యమైన ప్రసారాలు అందిస్తామని ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ పృద్వీరాజ్ బాలిరెడ్డి తెలిపారు.  తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్వీబీసీ ఛైర్మ‌న్‌ మాట్లాడుతూ  భవిష్యత్తులో మరింత మెరుగ్గా ప్రసారాలను అందించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను సమకూర్చుకోనున్న‌ట్లు వివ‌రించారు.  ప్ర‌తిభ ఉన్న క‌ళాకారుల‌ను నాదనీరాజ‌నంలో అవ‌కాశం క‌ల్పించి ప్రొత్స‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.  అదేవిధంగా శ్రీ‌వారి సేవ‌ల‌ ప్రత్యక్ష ప్రసారాలలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వ్యాఖ్యానం అందిస్తున్నామ‌న్నారు.  శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో 36 హెచ్‌డి కెమెరాలను, 3 జిమ్మిజిప్పులు వాడామన్నారు.
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు యూట్యూబ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా   తిలకించేలా  ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలకు రాలేని భక్తులు నాలుగు మాడవీధులలో వున్న అనుభూతిని పొందేలా నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నామని తెలిపారు. వాహనసేవలతోపాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించే స్నపనతిరుమంజనం, ఇతర కైంకర్యాలు, నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న కార్యక్రమాలను మెరుగ్గా ప్రసారం చేస్తున్నామ‌న్నారు.

        ఎస్వీబీసి సిఇవో శ్రీ న‌గేష్ మాట్లాడుతూ మ‌రో 6 నెల‌లో ఎస్వీబీసీ -3 క‌న్న‌డ ఛాన‌ల్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను రోజుకు సరాసరి 11 గంటలపాటు నిరంత‌రాయంగా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. గరుడసేవ రోజున 5 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం అందించామన్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి శ్రీ టి.ర‌వి, స‌హ‌య ప్ర‌జాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ‌,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.