TEPPOTSAVAM AT SRI KAPILESWARA TEMPLE FROM JAN 05- 09 _ జనవరి 5 నుండి 9వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు

Tirupati, 4 Jan. 20: TTD is grandly organising a five day Teppotsavam (float festival) at Sri Kapileswara temple from January 5-9.

On day one Utsava idol of Vinayaka will be taken out for five rounds in the Pushkarani. On day-2 Subramanya Swamy will be taken on five rounds.

Day-3 Sri Somaskanda will ride the float in five rounds, while on day-4  Goddess Kamakshi will go in seven rounds and on day-5 the idols of Sri Chandikeswara Swamy and Sri Chandrasekhara Swamy will go in 9 rounds. Unjal seva will be held during evenings ahead of Teppotsavams.

On the occasion of Arudra darshan Mahotsavam on January 10, the procession of Sri Nataraja, Sri Shivagami and Sri Manikyavasa will be held in Tirupati.

The artists of Annamacharya project will present Bhakti sangeet on all these days.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జనవరి 5 నుండి 9వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు
 
తిరుపతి, 2020 జనవరి 4: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 5 నుండి 9వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన జనవరి 5వ తేదీన శ్రీ వినాయక స్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు విహరిస్తారు. రెండవ రోజు శ్రీ సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు, మూడవ రోజు శ్రీ సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదో రోజు శ్రీ చండికేశ్వరస్వామివారు మ‌రియు శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల సేవ‌,  సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

జనవరి 10వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.