TEPPOTSAVAMS AT SRI GT FROM FEB 2-8 _ ఫిబ్రవరి 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

Tirupathi 01 Feb 20 ; Annual Teppotsavams will be observed in Sri Govindarajaswamy temple from February 2 to 8 with daily rides for utsava Idols on flower and electrical decorated float.

On February 2, five rounds on float with Sri Kodandaramaswami, on February 3 five rounds with Sri Parthasarathy idol, on February 4 Five rounds of Sri Kalyana Venkateswara Swamy, on February 5 Sri Krishna with Sri  Andal Ammavaru will take 5 rounds on float and on February 6 and 7 – seven rounds on float by Sri Govindarajaswamy.

The artists of cultural wings of TTD including HDPP and Annamacharya Project will present bhajans, Harikatha and Bhakti sangeet programs on all days.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్రవరి 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి, 2020 ఫిబ్ర‌వరి 01: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ  వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

ఫిబ్రవరి 2న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 3న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 4న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 5న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 6, 7, 8వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు       – 7 చుట్లు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.