THOUSANDS OF PILGRIMS WITNESS SRINIVASA KALYANAM IN KASI _ వారణాసిలో వైభవంగా శ్రీనివాస కల్యాణం 

Varanasi, 23 Feb 2013: It has been a colourful feast to many thousands of pairs of eyes who witnessed the grandeur of celestial wedding of Lord Malayappa Swamy (Lord Venkateswara or Lord Balaji) along with His two consorts in the country’s one of the important pilgrim centres, Kasi, where Maha Kumbh Mela is presently underway on Saturday.

 

The Srinivasa Kalyanam has been performed by Tirumala Tirupati Devasthanams (TTD) with spiritual splendour and religious ecstasy in the renowned Saiva Khetra of Kasti in the premises of the world famous Benaras Hindu University. The celestial fete was performed by a team of priests hailing from TTD.

 

Addressing the ceremonious occasion, TTD EO Sri LV Subramanyam said, “With an aim to propagate the moral values embedded in Hindu Sanatana Dharma and spread the Sri Venkateswara Bhakti cult across the globe, the temple administration of Tirumala Tirupati Devasthanams (TTD) has been organising Srinivasa Kalyanams-celestial marriage of Lord with His Consorts, at various places in India and abroad from the past seven years with the replica idols of Lord Sri Malayappa Swamy, Sri Devi and Bhu Devi”.

 

“Today the pilgrims and devotees are blessed to witness a rare opportunity of Shiva-Kesava Abedha in the form of Srinivasa Kalyanam in the famous Shiva Khetram which is taking place for the first time in this most sacred place. Usually Kalyanotsavam is performed as an Arjitha Seva (paid seva) in the hill shrine of Tirumala every day which is restricted to limited number of pilgrims. But now pilgrims can witness the grandeur of the celestial wedding of the deities in your own place. TTD has so far performed this Kalyanams in all the major cities in the country and also in US, Canada and Nepal. Let us bless our lives by taking part in this celestial wedding”, he added.

 

Meanwhile a team of archakas who perform pujas and Kalyanotsavam in the Srivari temple in Tirumala led by Agama scholar Sri Sunderavadanacharya and OSD Sri Pala Seshadri conducted the celestial marriage with utmost devotion and spiritual elegance with different aspects of puja starting with Vishwaksena Aradhana, followed by Punyahavachanam, Ankurarpana, Kanakana Dharana, Agni Pratistha, Mahajana Sankalpam, Kanyadanam, Mangalya Dharana Mahotsavam ceremony, Nakshatra Harati and concluding with Kumbha Harati.

 

The artistes of TTD’s Annamacharya Project enthralled the local denizens by rendering Keertans penned by Saint Poet Annamacharaya during the performance of Srinivasa Kalyanams. The various venue of Lord’s Kalyanams echoed with Govinda Namas of devotees who thronged the grounds to see majesty of Lord in the guise of Bride Groom and sanctified their lives.

TTD Joint EO Tirupati Sri P Venkatrami Reddy, CVSO Sri GVG Ashok Kumar, Benaras Hindu University’s Shastra and Dharma Vignan Department Prof. Anjaneya Shastry, Scholar from US Sri Yagna Subramanyam, Pundit from Kasti Sri Tripathi, local officers, denizens, students of Benaras Hindu University, TTD staff also took part in this celestial marriage.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER TTDs TIRUPATI (Camp in Varanasi)

వారణాసిలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

తిరుపతి, ఫిబ్రవరి 23, 2013  : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి, అధికార యంత్రాంగం సమన్వయ కృషితో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాదు మహాకుంభమేళా సందర్భంగా వారణాసిలో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని శ్రీ కాశీ విశ్వనాథ మందిరంలో జరిగిన స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శ్రీవారి కల్యాణం అనంతరం జోరుగా వర్షం కురవడంతో ఇదంతా శ్రీ బాలాజీ మహిమేనని భక్తులు తన్మయత్వం చెందారు.
ఈ సందర్భంగా తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాశీ క్షేత్రం హిందువులకు పరమ పవిత్రమైనదని, ఆ క్షేత్రంలో మొట్టమొదటిసారిగా శ్రీవారి కల్యాణం నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏడేళ్ల క్రితం స్వామివారి కల్యాణాలను ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో మాత్రమే గాకుండా మిగిలిన రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ”శ్రీనివాస కల్యాణం” పేరిట ఈ కల్యాణాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంతో హైందవ ధర్మ పరిరక్షణతోపాటు సమాజంలో భక్తిభావాన్ని పెంచుతోందని, ఆధ్యాత్మిక విలువలను కూడా తితిదే ప్రచారం చేస్తోందని చెప్పారు. ఆయా ప్రాంతాల భక్తులకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని తితిదే ఈ కల్యాణాల ద్వారా కల్పిస్తోందన్నారు. దూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవ సేవలో పాల్గొనలేని భక్తులకు ఈ చక్కటి అవకాశాన్ని తితిదే కల్పించిందన్నారు. శ్రీవారి కల్యాణంతో స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని ఈవో ఆకాంక్షించారు.
 
కాగా శనివారం సాయంత్రం 4.00 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం ప్రారంభమైంది. అర్చకులు యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూధ్రారణ ఘట్టాలతో   వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాణిని విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోని శాస్త్ర మరియు ధర్మవిజ్ఞాన్‌ విభాగం ఏర్పాటుచేసిన సదస్సులో ప్రసంగించారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం శాస్త్ర మరియు ధర్మవిజ్ఞాన్‌ విభాగం డీన్‌ శ్రీ ఆంజనేయశాస్త్రి, అమెరికా నుండి విచ్చేసిన శ్రీ యజ్ఞసుబ్రమణ్యం, కాశీ పండితులు త్రిపాఠి, వారణాసి జిల్లా అధికారులు, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, విద్యార్థులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వారణాసి నుండి తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.