TIRUMALA PONTIFF’s CHATURMASA DIKSHA FROM JULY 3 _ జూలై 3న తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష
Tirumala,28 June 2023: Tirumala Senior Pontiff Sri Sri Sri Pedda Jeeyarswami will commence his Chaturmasa Diksha at Tirumala from July 3.
A descendant of Sri Ramanujacharya, the senior Tirumala pontiff will commence his vratam a day after Purnima at Tirumala by offering prayers at Varahaswami temple, Swami Pushkarani ahead of entering the Srivari temple.
He will be accompanied in his holistic procession from his mutt near Bedi Anjaneya temple along with his second in command Sri Sri Sri Chinna Jeeyarswami and his disciples.
The TTD EO and other temple officials will receive at the temple Mahadwaram and lead him for Srivari Darshan. Thereafter both the pontiffs will be presented with a sacred vastram.
The legend say that as per Sanatana Hindu tradition, this Diksha is very significant. During the Chaturmasa Diksha (Shravana, Bhadrapada, Ashwayuja and Karthika Masams) the pontiffs will perform japa, Homa seeking the well-being of humanity.
జూలై 3న తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష
తిరుమల, 2023 జూన్ 28: జూలై 3వ తేదీ తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత, దానాదులను లోక కల్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలో రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన ఉన్న జీయంగారి మఠం నుండి చిన్నజీయంగారు మరియు శిష్య బృందంతో కూడి ముందుగా వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించి అనంతరం శ్రీవారి ఆలయానికి విచ్చేస్తారు. శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టీటీడీ ఈఓ ఇతర ఆలయ అధికారులతో కలిసి మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్ వస్త్రాన్ని, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగారికి నూలుచాటు వస్త్రాన్ని బహూకరిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికార ప్రముఖులు పాల్గొంటారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.