TIRUPATI JEO INSPECTS TTD PRINTING PRESS _ టిటిడి ప్రెస్‌ను పరిశీలించిన తిరుపతి జెఈవో
Tirupati 26 July 2019 ; TPT JEO Sri P Basant Kumar on Friday inspected the Printing Press of TTD in Tirupati.
Speaking on this occasion, he instructed the concerned to make better use of advanced technology available today in the printing process. “Lot of technological evolution has taken place and we should own that for better results. All the spirituals books should be made available on TTD website for the sake of global readers”, he said.
The JEO also directed the officials concerned to give a report on the requirement of manpower and infrastructure resources to purchase new machinery for printing process.
The JEO also suggested to set up digital display screens instead of photos and display the names of the officials through automatic rotation technology of those who discharged duties as HoDs of Printing Press.
Printing Press DyEO Sri RV Vijay Kumar, Assistant Managers Sri Prabhakar, Sri Ravichandra and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ప్రెస్‌ను పరిశీలించిన తిరుపతి జెఈవో
తిరుపతిలోని టిటిడి ప్రెస్‌ను శుక్రవారం తిరుపతి జెఈవో శ్రీ పి. బసంత్ కుమార్ పరిశీలించారు.
తిరుపతి, 26 జూలై 2019 ; ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించి టిటిడి ముద్రించే పుస్తకాలను, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక పుస్తకాలను ఆన్ లైన్ లో పొందుపరచాలని సూచించారు. భక్తులు ఆన్ లైన్ లో కూడా పుస్తకాలను చదువుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పుస్తకాల ముద్రణ, యంత్రాల కొనుగోలు, మానవ వనరులు తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందించాలన్నారు.
అంతకుముందు ప్రెస్‌లోని ఆఫ్ సెట్, బైండింగ్, డిటిపి, సిటిపి మిషన్ తదితర విభాగాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇటీవల టిటిడి ప్రెస్ ముద్రించిన పుస్తకాలను జెఈవోకు అధికారులు చూపించారు. ప్రెస్‌లో ఇప్పటి వరకు పనిచేసిన ఉన్నతాధికారుల ఫొటోలు, పేర్లు ఆటోమెటిక్ గా రొటేట్ అయ్యేలా రూపొందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ డిప్యూటీ ఈవో శ్రీ ఆర్.వి.విజయ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్లు శ్రీ ప్రభాకర్, శ్రీ రవిచంద్ర, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.