TIRUPATITES GETS CULTURAL FEAST _ తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ

Tirupati, 5 Oct. 19: The denizens of Tirupati enjoyed the devotional cultural feast on Saturday on various platforms as a part of ongoing Sri vari Brahmotsavams. 

The programmes organised by Annamacharya,  HDPP,  Dasa Sahitya Projects attracted the art lovers. 

At Annamacharya Kalamandiram,  the Damodaram sisters mused devotees with some fine note of Annamaiah Sankeertans.  While at Mahati , the Odisha Dance remained a special attraction and dance concert by Sri Rajarajeswari Arts Academy enthralled denizens at Ramachandra Pushkarini. 

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

                                                             

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ

 అక్టోబరు 05, తిరుప‌తి, 2019 ; శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుప‌తిలో శ‌నివారం టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.

 ఇందులో భాగంగా తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఒడిశా ప్ర‌భుత్వ క‌ళాకారుల‌ బృందం ఒడిస్సీ నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

  అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశాఖ‌ప‌ట్నంకు చెందిన జాగ‌ర్ల‌పూడి మాధ‌వికృష్ణ భక్తి సంగీత క‌చేరి నిర్వ‌హించారు.

 రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ ఎ.కోదండ‌రామ‌య్య బృందం భ‌క్తి సంగీతం, తిరుప‌తికి చెందిన శ్రీ రాజ‌రాజేశ్వ‌రి ఆర్ట్స్ అకాడ‌మి బృందం నృత్య‌ కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.