TIRUVADIPURAM UTSAVAM _ ఆగస్టు 7న శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

TIRUPATI, 06 AUGUST 2024: Sri Andal Tiruvadipuram Utsavam will be observed in Sri Govindaraja Swamy temple in Tirupati on August 7.

In the morning Snapana Tirumanjanam will be performed to the utsava deities.

In the evening Asthanam to the utsava deities will be held at Alipiri. Later in the night Andal Sattumora will be performed in Sri Andal Goda Devi Sannidhi.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 7న శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

తిరుపతి, 2024 ఆగస్టు 06: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 7వ తేదీ శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది.

శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సంద‌ర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్‌ క్వార్టర్స్‌ గీతామందిరం,ఆర్ ఎస్ మాడవీధిలోని వైఖానసాచార్యుల వారి ఆలయం, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.