TONSURING ACTIVITY IN TIRUMALA STANDS NEXT TO DARSHAN IN TERMS OF PILGRIMS NUMBERS-KKC DyEO_ కల్యాణకట్టలో భక్తులకు సత్వర సేవలు డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న

Tirumala, 20 September 2018: Majority of devotees who throng Tirumala to have darshan of Lord Venkateswara, feel it mandatory to offer their hair as a sign of total surrender towards Lord, said, Kalyanakatta DyEO Smt Nagaratna.

During the media briefing at Rambhageecha Rest House 2 on Thursday, the DyEO said, there are nine Kalyanakattas in Tirumala including main Kalyana Katta Complex(KKC). Among them, the main, PAC1 and 2, SPRH and SVRH KKCs work round the clock while the Nandakam and GNC mini KKCs work from 3am to 5pm, HVC and Sapthagiri KKCs between 6am and 6pm.

There are a total of 1,397 barbers working in KKCs which includes 279 women tonsurers also involved in the tonsuring activity and we use all hygienic methods. We are supplying qualitative blades, dettol antiseptic lotion, sandal pills and masks to the barbers to avoid any infectious diseases to both barbers and pilgrims, she added.

The KKC Head said, so far from September 13 to 19, in the last seven days,1,89,826 pilgrims offered hairs during brahmotsavams.

TTD PRO Dr T Ravi, Asst.PRO Kum P Neelima were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కల్యాణకట్టలో భక్తులకు సత్వర సేవలు డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న

తిరుమల, 2018 సెప్టెంబరు 20: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తులకు కల్యాణకట్టలో సత్వర సేవలు అందిస్తున్నట్టు, 8 రోజులలో 1.9 లక్షల మంది తలనీలాలు సమర్పించినట్లు కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న తెలిపారు. తిరుమలలోని రాంభగీచా – 2లో మీడియా సెంటర్‌లో గురువారం ఉదయం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో కల్యాణకట్ట సిబ్బంది సేవలను వివరించారు.

టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.యస్‌.శ్రీనివాసరాజు అదేశాల మేరకు బ్రహ్మోత్సవాల్లో తిరుమలలోని 9 కల్యాణకట్టల్లో 1397 మంది క్షురకులు 24 గంటలు తలనీలాలు తీయుటకు నియమించినట్లు తెలిపారు. వీరు తిరుమలలోని ప్రధాన కల్యాణ కట్ట, పి.ఎ.సి.-1, పి.ఎ.సి.-2, ఎస్వీ విశ్రాంతి భవనము, పద్మావతి అతిధి భవనాల వద్ద 24 గంటలు, నందకం, జి.ఎన్‌.సి. మినీ కల్యాణ కట్టలలో ఉదయం 3.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు, సప్తగిరి, హెచ్‌.వి.సి. మినీ కల్యాణ కట్టలలో ఉదయం 6.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు సేవలందిస్తున్నట్లు వివరించారు. ప్రత్యేకంగా మహిళా క్షురకులు 279 మందిని నియమించగా వీరు మహిళలకు, చిన్న పిల్లలకు తల నీలాలు తీస్తున్నాట్లు తెలిపారు. దీని వలన భక్తులు వేచి వుండే సమయం తగ్గి త్వరగా తలనీలాలు సమర్పించుకుంటున్నట్లు తెలియజేశారు.

భక్తులకు తలనీలాలు తీయు సమయంలో అంటువ్యాదుల నివారణకు క్షురకులకు నాణ్యమైన బ్లేడులు, డెటాల్‌, సొల్యూషన్‌, మాస్కులను వినియోగిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఎడాది స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 8 రోజులకు 1,89,826 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్టు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రజా సంబంధాల అధికారి డా|| టి.రవి, సహాయ ప్రజా సంబంధాల అధికారి కుమారి నీలిమ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.