TRAIMASIKA METLOTSAVAM REACHES THE SECOND DAY _ కొనసాగుతున్న భజనమండళ్ల సామూహిక భజనలు

TIRUPATI, 11 JULY 2023: The Traimasika Metlotsavam organised under the aegis of TTD’s Dasa Sahitya Project reached the second day on Tuesday.

 

The programmes for Bhajana Mandalis commenced at 5am with Suprabhatam followed by Dhyanam, Community Bhajans, and Sankeertans. The programme concluded with a religious discourse at the Third Chowltry located behind Railway Station in Tirupati.

 

On July 12, Metla Pooja will be performed.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కొనసాగుతున్న భజనమండళ్ల సామూహిక భజనలు

తిరుపతి, 2023 జూలై 11: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం భజనమండళ్ల సామూహిక భజనలు కొనసాగాయి.

తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుండి భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత సంకీర్తనాలాపన, ధార్మిక సందేశం వినిపించారు.

జూలై 12న మెట్లోత్సవం

జూలై 12న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని దర్శించుకుంటారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.