TTD CANCELS POURNAMI GARUDA SEVA _ మార్చి 28న పౌర్ణ‌మి గ‌రుడ సేవ ర‌ద్దు

NO PERMISSION TO DEVOTEES FOR TUMBURU THEERTHA MUKKOTI

Tirumala, 27 Mar. 21: In view of the annual Teppotsavams, TTD has cancelled the monthly Pournami Garuda Seva on Sunday. 

As per the norms of Central and State Governments in view of Covid, TTD has also cancelled permission to devotees to trek Tumburu theertha Mukkoti on the auspicious day of Phalguna Pournami on Sunday, March 28.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

మార్చి 28న పౌర్ణ‌మి గ‌రుడ సేవ ర‌ద్దు

కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు తుంబురు తీర్థానికి భ‌క్తుల‌కు అనుమ‌తి లేదు

తిరుమల, 2021మార్చి 27: శ్రీవారి ఆల‌యంలో మార్చి 28వ తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి  గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

శ్రీ‌వారి వార్షిక తెప్పోత్స‌వాలు జ‌రుగుతున్న కార‌ణంగా పౌర్ణ‌మి గరుడసేవ ర‌ద్ద‌యింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తుంబురు తీర్థానికి భ‌క్తుల‌కు అనుమ‌తి లేదు

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమ‌ల‌లో మార్చి 28వ తేదీన తుంబురు తీర్థ ముక్కోటికి భ‌క్తుల‌కు అనుమ‌తి లేద‌ని టిటిడి తెలిపింది. ఈ ప‌ర్వ‌దినం నాడు ఎక్కువ మంది భ‌క్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్ర‌దాయం ఉన్నందువ‌ల్ల, భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టిటిడి స్ప‌ష్టం చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.