TTD CHAIRMAN, EO THANKS DEVOTEES TOWARDS THE SUCCESS OF ASTABANDHANA BALALAYA MAHA SAMPROKSHANAM _ శాస్త్రోక్తంగా ముగిసిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 16 August 2018 : TTD Chairman Sri Putta Sudhakar Yadav and EO Sri Anil Kumar Singhal thanked the pilgrims across globe, for co-operating and honouring the appeals of Tirumala Tirupati Devasthanams and making Asta Bandhana Balalaya Maha Samprokshanam a grand success.

After the mega religious event, speaking to media persons out side the temple on Thursday, the Chairman said, eminent ritwiks from Andhra Pradesh, Tamil Nadu and Karnataka took part in this five day fete and performed the Astabandhana Balalalya Mahasamprokshanam with utmost dedication as per the tenets of Agama shastra.

EO said, as per the advice of Agama Salaha Mandali, HH Tirumala Pedda Jiyangar, HH Tirumala Chinna Jiyangar Swamijis, the celestial fete was carried out in a successful manner under Chief Priest Sri Venugopala Deekshitulu from August 11 to 16. In the last five days, over 1.35lakh pilgrims had hassle free darshan of Lord Venkateswara. From August 17 onwards, all the sevas and different formats of darshan will resume as usual”, he added.

Chief Priest Sri Venugopala Deekshitulu said, Purnahuti was performed on the final day of Astabandhana Balalayam and Kalavahanam was performed to Mula Virat and other deities of sub-temples. Special Neivedyam was offered to all the deities and Maha Samprokshanam concluded with Akshataropanam.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా ముగిసిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఆగస్టు 16, తిరుమల 2018 ; తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకోసారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ముగిసిందని, టిటిడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సహకరించిన భక్తులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వెల్లడించారు.

మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయం వెలుపల ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నిష్ణాతులైన ఋత్వికులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. టిటిడి నిర్ణయించిన సమయాల్లో యాగశాల కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తులు ఎంతో క్రమశిక్షణతో స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ ఆగమ సలహా మండలి సూచనల మేరకు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్‌ సమక్షంలో ఆలయ ప్రధానార్చకులు శ్రీవేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో వైభవంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 44 మంది ఋత్వికులు, 100 మంది వేదపండితులు ఈ పాల్గొన్నారని తెలిపారు. ఆగస్టు 11 నుండి ఆగస్టు 15వ తేదీ సాయంత్రం వరకు 1.35 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలియజేశారు. ఆగస్టు 17వ తేదీ నుండి యధావిధిగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని వివరించారు.

తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ గురువారం ఉదయం 10.30 గంటలకు అర్చకులు శ్రీ ఖాద్రి నరసింహాచార్యులు చేతులమీదుగా ఆనందనిలయ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ జరిగినట్టు తెలిపారు. యాగశాల కార్యక్రమాల అనంతరం శ్రీభోగశ్రీనివాసమూర్తి, శ్రీఉగ్ర శ్రీనివాసమూర్తితోపాటు ఇతర దేవతామూర్తులను తిరిగి పూర్వస్థానాల్లోకి వేంచేపు చేసినట్టు చెప్పారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ విజయవంతంగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఇతర రాజకీయ ప్రముఖులకు, అధికారులకు, ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు మాట్లాడుతూ చివరిరోజు కార్యక్రమాల్లో భాగంగా 27 హోమగుండాల్లో పూర్ణాహుతి నిర్వహించినట్టు తెలిపారు. గర్భాలయంలో శ్రీవారి మూలమూర్తికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు ఆగమోక్తంగా కళావాహనం నిర్వహించామన్నారు. కళశాల్లోని శక్తిని తిరిగి విగ్రహాల్లోకి ఆవాహన చేయడాన్ని కళావాహనం అంటారని తెలిపారు. ఆ తరువాత ప్రత్యేక ఆరాధనలు, విశేషనైవేద్యాలు సమర్పించిన అనంతరం అక్షతారోపణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగిసిందన్నారు.

కాగా, ఉదయం కార్యక్రమాల్లో భాగంగా హోమగుండాలకు పూర్ణాహుతి, ప్రబంధ సాత్తుమొర, వేద సాత్తుమొర నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులతోపాటు ఋత్వికులను ఆలయ ప్రదక్షిణగా అర్చక నిలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అర్చక బహుమానం సమర్పించారు. గరుడ పంచమిని పురస్కరించుకుని సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీచల్లా రామచంద్రారెడ్డి, శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీఅశోక్‌రెడ్డి, శ్రీ శ్రీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఇతర ప్రధానార్చకులు, ఓఎస్‌డి శ్రీపాల శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.