TTD DENIES ANY SCAM IN ONLINE SED TICKETS _ ఆన్‌లైన్ ద‌ర్శ‌న టికెట్ల జారీలో ఎలాంటి కుంభ‌కోణం లేదు

Tirumala, 05 January 2022: TTD on Wednesday denies reports of a Telangana newspaper about a racket in online Special Entry Darshan tickets issue as baseless.

TTD said in a statement that its vigilance wing regularly monitored the issue of SED tickets and ensured against any malpractices.

Within an hour of allotment of tickets, the devotees booked their tickets as tickets are issued to devotees very quickly with the support of TTD cloud technology.

TTD appealed to devotees to not be carried away and believe in such imaginary allegations and baseless news reports.

TTD also cautioned publications that such baseless and untrue reports would be legally dealt with by TTD to protect the sentiments of devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆన్‌లైన్ ద‌ర్శ‌న టికెట్ల జారీలో ఎలాంటి కుంభ‌కోణం లేదు

తిరుమ‌ల‌, 2022 జ‌నవ‌రి 05 ;ఆన్‌లైన్ ద‌ర్శ‌న టికెట్ల జారీలో భారీ కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు తెలంగాణ‌కు చెందిన ఒక తెలుగు దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన వార్త అవాస్త‌వం.

టిటిడి విజిలెన్స్ విభాగం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ద‌ర్శ‌న టికెట్ల జారీపై నిఘా ఉంచుతుంది. టికెట్ల కేటాయింపులో ఎలాంటి అక్ర‌మాలు జ‌రిగే అవ‌కాశ‌మే లేదు. ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేసిన గంట‌లోపే భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. టిటిడి క్లౌడ్ టెక్నాల‌జి ద్వారా ఆన్‌లైన్‌లో దర్శ‌న టికెట్లు విడుద‌ల చేస్తున్నందువ‌ల్ల భ‌క్తులు చాలా వేగంగా వీటిని పొంద‌గ‌లుగుతున్నారు. అంతే కానీ ఇందులో ఎలాంటి మతలబులు మరొకటి లేవు. కనుక భక్త్తులు ఇటువంటి వార్తలను నమ్మవద్దని కోరడమైనది. ఊహాజనిత ఆరోపణలతో కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.