TTD EO INAUGURATES TTD PHOTO EXHIBITION AT SRIVARI VAIBHAVOTSAM IN NELLORE _ నెల్లూరు వైభవోత్సవాల్లో టిటిడి ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Nellore,16 August 2022: TTD EO Sri AV Dharma Reddy along with Rajya Sabha MP Sri Vemireddy Prabhakar Reddy on Tuesday inaugurated the TTD photo exhibition organized by the PR Department as part of Sri Venkateswara  Vaibhavotsam fete organized in Sri Potti Sriramulu Nellore district.

Later he also visited the publications stall, Panchagavya products stall, and also Go puja locations at the AC Subba Reddy Stadium which is hosting the festivities.

The TTD EO scrutinized the flexes put up at the exhibition including Gopuja and Saptagopradakshinashala, desi cows breeding at Gosamrakshanashala,

Go based organic farming products for Srivari Naivedyam, devotees turn out for Srivari darshan during last five years, Srivari Seva, Navaneeta Seva, electric cars, laddu Prasadam, Pavitra Gardens, Agarbattis, Panchagavya products making, photo frames of deities made of Dry Flower Technology and Srivari Pushpa Prasadam, etc.

Thereafter the TTD EO participated in the Sahasra Deepalankara Seva performed at the model Srivari temple at the Vaibhavotsam fete location.

TTD JEO Sri Veerabrahmam, SE-2 Sri Jagadeswar Reddy, VGO Sri Manohar, DE Sri Ravishankar Reddy, EE Smt Sumati, and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

నెల్లూరు వైభవోత్సవాల్లో టిటిడి ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

 నెల్లూరు, 2022, ఆగస్టు 16 ;నెల్లూరులోని శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను మంగళవారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పబ్లికేషన్ స్టాల్, పంచగవ్య ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఆ తరువాత గోపూజ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.

ఫొటో ఎగ్జిబిషన్లో గోవు మహత్యం, గోపూజ విశిష్టత, సప్తగోప్రదక్షిణశాల, గోసంరక్షణశాలలో దేశవాళీ ఆవుల పెంపకం, గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, గత ఐదు దశాబ్దాల్లో శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల సంఖ్య, శ్రీవారి సేవ, నవనీత సేవ, విద్యుత్ కార్లు, లడ్డూ ప్రసాదం, పవిత్ర ఉద్యానవనాలు, అగరబత్తుల తయారీ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, శ్రీవారి పుష్ప ప్రసాదం ఫొటో ఫ్రేమ్స్ తదితరాల ఫ్లెక్సీలు పరిశీలించారు .

అదేవిధంగా, శ్రీవారి వైభవాన్ని తెలిపేలా ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంచారు. ‘నమామి గోవింద’ పేరుతో విడుదల చేసిన పంచగవ్య ఉత్పత్తులు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన ఫొటో ఫ్రేమ్స్ భక్తులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు. టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం వీటి గురించి రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వివరించారు.

అనంతరం నమూనా ఆలయంలో నిర్వహించిన శ్రీవారి సహస్రదీపాలంకరణ సేవలో టిటిడి ఈవో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజిఓ శ్రీ మనోహర్, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, ఇఇ శ్రీమతి సుమతి, ఎఇ శ్రీ ఆంజనేయ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.