TTD EO INSPECTS SRI GT RENOVATION WORKS _ శ్రీగోవిందరాజస్వామివారి గర్భాలయ జీర్ణోద్ధరణ పనులను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 2 March 2018; The TTD Executive officer, Sri Anil Kumar Singhal on Friday inspected the renovation and modernization work at the Sri Govindaraja temple.
Initially, he inspected the works of the Dwajasthambam later also went around the sanctum and scrutinized the works and gave suggestions.
The EO had darshan in the sub-temples of Sri Parthasarathy Swamy, Sri Andal Ammavaru, and Sri Kalyana Venkateswara. He also enquired with archakas and temple staff about the repair works at the Addala Mantapam and directed them to complete the renovation works on a war footing.
Thereafter the EO also visited the sub-temples of Eduru Anjaneyaswami, Sri Tirumala Nambi, Bashyakarlu, Korathalwar, Madhur Kavi Alwar, Mudaliyandan and evaluated the renovation works.
Among others Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, CE Sri Chandrasekhar Reddy, TTD Agama advisor Sri NK Sundara Varadan, Temple Chief Priest Sri Srinivasa Deekshitulu, DyEO Smt Varalakshmi, Srivari Temple OSD Sri Pala Seshadri, SE (Electrical) Sri Venkateswarlu, DE Sri Chandrasekhar, AEO Sri Ganga Raju.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీగోవిందరాజస్వామివారి గర్భాలయ జీర్ణోద్ధరణ పనులను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుపతి, 2018 మార్చి 02: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి గర్భాలయ జీర్ణోద్ధరణ (ఆధునీకరణ) పనులను శుక్రవారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
మొదటగా ఆలయ ధ్వజస్తంభం పనులను పరిశీలించారు. అనంతరం శ్రీగోవిందరాజస్వామివారి గర్భాలయంలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అటుతర్వాత శ్రీ పార్థసారధిస్వామివారిని, శ్రీ ఆండాల్ అమ్మవారిని, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో ఆలయ మరమ్మత్తు పనుల పురోగతిపై వేద పండితులు, ఆలయ అర్చకులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీర్ణోద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీ తిరుమలనంబి, భాష్యకార్లు, కూరత్తళ్వార్, మధురకవి ఆళ్వార్, మొదలియాండన్ సన్నిధుల్లో గర్భాలయ జీర్ణోద్ధరణ పనులను ఈవో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, సిఇ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, టిటిడి ఆగమ సలహాదారులు శ్రీ ఎన్‌ఏకె.సుందరవరదన్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డిఇ శ్రీ చంద్రశేఖర్, ఎవిఎస్వో శ్రీ గంగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.