TTD EO TO TAKE PART IN A SERIES OF I-DAY EVENTS _ టిటిడిలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

TIRUPATI, 15 AUGUST 2022: TTD EO Sri AV Dharma Reddy will take part a series of Independence Day events in Tirupati on Monday.

 

At 8:15am he will hoist the National Flag at SV Vedic University and later takes part in the I-Day Parade in TTD Administrative Building from 9am onwards after unfurling the National Flag.

 

The EO leads the Azadi ka Amrit Mahotsav rally from 11am onwards with the employees and students of TTD schools which commences at the Admin building and concludes at Mahati Auditorium.

 

In the evening at 5:30pm, TTD EO hosts “At Home” event in His Bungalow at Tirupati where in the elite of Temple City from various fields takes part.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడిలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

 తిరుపతి, 2022 ఆగ‌స్టు 14: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల పిలుపుమేర‌కు ఆజాదీకా అమృత్ మ‌హోత్సవాల్లో భాగంగా టిటిడి సోమ‌వారం పెద్ద ఎత్తున స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నుంది. ఆ కార్య‌క్ర‌మాల వివ‌రాలు ఇవి.

– ఉదయం 8.15 గంటలకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో టిటిడి ఈవో, ఉప కుల‌ప‌తి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ చేస్తారు.

– ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని ప‌రేడ్ మైదానంలో ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగుర‌వేస్తారు. అనంత‌రం ప‌రేడ్‌లో పాల్గొంటారు.

– ఉదయం 11 గంటలకు ప‌రిపాల‌న భ‌వ‌నం నుండి మ‌హ‌తి ఆడిటోరియం వ‌ర‌కు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు.

– సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని ఈఓ బంగళాలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “ఎట్ హోమ్” కార్యక్రమం నిర్వహిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.