TTD INKS MoU WITH IOCL FOR BIO GAS PLANT _ తిరుమ‌ల‌లో బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఐఓసిఎల్‌తో ఎంఓయు

Tirumala, 12 October 2022: TTD and Indian Oil Corporation Ltd (IOCL ) on Wednesday signed an MOU at   Annamaiah Bhavan in Tirumala to set up a plant for the production of bio gas from wet garbage.

 

SE-2 Sri Jagadeeshwar Reddy and IOCL Executive Director Sri Anil Kumar exchanged the MoU documents signed as part in of Swatcha Bharat campaign.

 

The 12 crore bio-gas plant set up as a joint venture with TTD and IOCL investing 6 crore each will be spread on two-acre land and consume 35 tons of wet wastes daily.

 

The plant generates 1.6 metric tons of gas which will be utilised for the preparation of food at the Anna Prasadam Complex.

 

ONGC CGM Sri Suryanarayana Raju, GM Sri Subramaniam, TTD EE Sri Srihari and other officials were present.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఐఓసిఎల్‌తో ఎంఓయు

తిరుమ‌ల‌, 2022 అక్టోబ‌రు 12: తిరుమ‌ల‌లోని త‌డిచెత్త ద్వారా బ‌యోగ్యాస్ ఉత్ప‌త్తి చేసేందుకు టీటీడీ, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (ఐఓసిఎల్‌)తో ఎంఓయు కుదుర్చుకుంది. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం ఉద‌యం టీటీడీ ఎస్ఇ – 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఐఓసిఎల్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ అనీల్‌కుమార్ ఎంఓయు ప‌త్రాల‌ను మార్చుకున్నారు.

స్వ‌చ్ఛ తిరుమ‌ల‌లో భాగంగా టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో త‌డిచెత్త ద్వారా బ‌యో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా టీటీడీ రూ.6 కోట్లు, ఐఓసిల్ రూ.6 కోట్లు క‌లిసి మొత్తం రూ.12 కోట్ల‌తో రెండు ఎక‌రాల విస్తీర్ణంలో తిరుమ‌ల‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌తి రోజు 35 ట‌న్నుల వ్య‌ర్థాల‌ను ఇందు కోసం వినియోగిస్తారు. తిరుమ‌ల‌లో రోజుకు 3.5 నుండి 4.5 మెట్రిక్‌ ట‌న్నుల గ్యాస్ అవ‌స‌రం కాగా, ఇందులో 1.6 మెట్రిక్ ట‌న్నుల గ్యాస్ ఈ ప్లాంట్ నుండి ఉత్ప‌త్తి అవుతుంది. దీనిని అన్న‌ప్ర‌సాదాల త‌యారీ కేంద్రంలో వినియోగించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ సమావేశంలో ఓఎన్‌జిసి సిజిఎం శ్రీ సూర్య‌నారాయ‌ణ రాజు, జిఎం శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, టీటీడీ ఇఇ శ్రీ శ్రీ‌హ‌రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.