TTD SPECIAL OFFICER MEETS VEGETABLE DONORS_ కూర‌గాయ‌ల దాత‌ల‌తో ప్ర‌త్యేకాధికారి స‌మావేశం

Tirumala, 17 Aug. 19: TTDs special officer at Tirumala Sri AV Dharma Reddy said that so far ₹100 crore worth vegetables were freely donated by Vegetable donors since 2005.

Addressing a meeting of the vegetable donors at Annamaiah Bhavan on Saturday, the SO said daily 6-8 tonnes of fresh vegetables were freely given by them enhancing the quality and taste of Anna Prasadam being served to over 1.5lakh pilgrims.

He lauded the donors who were even hiring vehicles to supply vegetables and said TTD will organise vehicles for them in next two months.

Donors Sri Kutumba Rao from Vijayawada, Sri S Chandran, Sri Thiagarajan from Chennai and Sri Rajendran from Thiruvur narrated their experiences in Srivari service.

TTD marketing GM Sri Jagadeswara Reddy, Anna Prasadam special officer Sri S Venugopal, catering officer Sri GLN Shastri participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కూర‌గాయ‌ల దాత‌ల‌తో ప్ర‌త్యేకాధికారి స‌మావేశం

తిరుమ‌ల‌, 2019 ఆగస్టు 17: తిరుమ‌లలో అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి వినియోగించే కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేసే దాత‌ల‌తో శ‌నివారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకాధికారి మాట్లాడుతూ తిరుమ‌లలో పెద్ద ఎత్తున భ‌క్తుల‌కు రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు కూర‌గాయ‌ల‌ దాత‌లు ఎంతో స‌హ‌కారం అందిస్తున్నార‌ని తెలిపారు. 2005వ సంవ‌త్స‌రంలో కూర‌గాయ‌ల దాత‌ల అసోసియేష‌న్ ఏర్పాటు జ‌రిగింద‌ని, అప్ప‌టినుండి నిరంత‌రాయంగా కూర‌గాయల స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. ఇప్ప‌టివ‌ర‌కు రూ.100 కోట్ల‌కు పైగా విలువైన కూర‌గాయ‌ల‌ను దాత‌లు విరాళాలుగా అందించార‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం రోజుకు 6 నుండి 8 ట‌న్నుల కూర‌గాయ‌లు అవ‌స‌ర‌మ‌వుతోంద‌ని, పూర్తిగా దాత‌లే అందిస్తున్నార‌ని తెలియ‌జేశారు. తాజా కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేస్తుండ‌డంతో అన్న‌ప్ర‌సాదాలు రుచిక‌రంగా, నాణ్యంగా ఉంటున్నాయ‌న్నారు. అన్నిర‌కాల కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోర‌డంతో దాత‌లు అంగీక‌రించారని తెలిపారు. కూర‌గాయ‌ల సేక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన వాహ‌నాలను రెండు నెల‌ల్లోపు స‌మ‌కూర్చుతామ‌న్నారు. ప‌లువురు దాత‌లు కూర‌గాయ‌లు కొనుగోలు చేయ‌డంతోపాటు సొంతంగా వాహ‌న అద్దె చెల్లించి పంపుతున్నార‌ని, వారికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

అనంత‌రం దాత‌లు విజ‌య‌వాడ నుండి శ్రీ కుటుంబరావు, చెన్నై నుండి శ్రీ ఎస్‌.చంద్ర‌న్‌, శ్రీ త్యాగ‌రాజ‌న్ మాట్లాడుతూ త‌మ అనుభ‌వాల‌ను తెలియ‌జేశారు. తిరుపూర్ నుండి శ్రీ రాజేంద్ర‌న్ మాట్లాడుతూ త‌న వ‌ద్ద వాసు అనే డ్రైవ‌రు ప‌నిచేస్తున్నార‌ని, ఆయ‌న‌కు చాలా కాలంగా సంతానం లేద‌ని చెప్పారు. ఆ డ్రైవ‌రు ఎంతో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో తిరుమ‌ల‌కు కూర‌గాయ‌ల లోడు తీసుకొస్తార‌ని, ఇటీవ‌ల స్వామివారి అనుగ్ర‌హంతో సంతానం క‌లిగింద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.

ఈ స‌మావేశంలో మార్కెటింగ్ జిఎం శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎస్‌.వేణుగోపాల్‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, వివిధ ప్రాంతాల నుండి వ‌చ్చిన కూర‌గాయ‌ల దాత‌లు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.