TTD STUDENT SELECTED FOR NATIONAL FENCING COMPETITION_ జాతీయ ఫెన్సింగ్‌ పోటీలకు టిటిడి పాఠశాల విద్యార్థిని ఎంపిక

Tirupati, 10 September 2018: A girl student Kum.Bhavishya, studying Seventh Standard in TTD run Sri Govinda Raja Swamy High School got select for National Fencing Competition in under 14 category.

This competition will be held at Cuttak in Orissa from September 12 to 17. Devasthanams Educational Officer Sri Ramachandra congratulated her and presented the fencing kit to her.

School principal Sri Krishna Murthy, trainer Sri Gopi Naidu were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జాతీయ ఫెన్సింగ్‌ పోటీలకు టిటిడి పాఠశాల విద్యార్థిని ఎంపిక

తిరుపతి, 2018 సెప్టెంబరు 10: టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కుమారి జి.భవిష్య ఒడిశాలోని కటక్‌లో సెప్టెంబరు 12 నుండి 17వ తేదీ వరకు జరుగనున్న జాతీయ ఫెన్సింగ్‌ పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు టిటిడి విద్యాశాఖాధికారి శ్రీ రామచంద్ర సోమవారం విద్యార్థినికి ఫెన్సింగ్‌ కిట్‌ను బహూకరించారు. అండర్‌ -14 విభాగంలో ఈ విద్యార్థిని ఫెన్సింగ్‌ పోటీలకు ఎంపికైంది.

ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకె.కృష్ణమూర్తి, శిక్షకుడు శ్రీ కె.గోపినాయుడు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.