TTD TEMPLES GEAR UP FOR NAVARATHRI UTSAVAMS _ అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వరకు పుంగ‌నూరు శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

TIRUPATI, 06 OCTOBER 2021: TTD temples get ready to observe Navarathri Utsavams from Thursday onwards.

Along with Sri Padmavathi temple at Tiruchanoor, the TTD taken over temples including Sri Kalyana Venkataramana Swamy temple at Punganuru in Chittoor district and Sri Neelakantheswara Swamy temple at Sri Potti Sriramulu Nellore district will be observed from October 7 tp 15.

 The officials of respective temples are making necessary arrangements for the same.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వరకు పుంగ‌నూరు శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2021 అక్టోబ‌రు 06: పుంగ‌నూరు శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఈ సందర్భంగా ఆలయంలోప్రతిరోజూ ఉద‌యం అష్ట‌ల‌క్ష్మి అమ్మవార్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేస్తారు.

అదేవిధంగా ప్ర‌తి రోజు సాయంత్రం స్వామివారు దశావతారాల‌లో ఒక్కొరోజు ఒక్కొ అవ‌తారంలో ద‌ర్శ‌నం ఇస్తారు. అక్టోబ‌రు 11న సాయంత్రం 6.30 గంట‌ల‌కు గ‌రుడ వాహ‌నంపై క‌టాక్షించ‌నున్నారు.

శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆల‌యంలో దేవి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

శ్రీ‌పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, తుమ్మూరు గ్రామంలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామి, శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆల‌యంలో అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు దేవి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా అక్టోబ‌రు 7న శ్రీ పార్వ‌తిదేవి, అక్టోబ‌రు 8న శ్రీ బాలా త్రిపుర‌సుంద‌రి, అక్టోబ‌రు 9న శ్రీ ల‌లితా త్రిపుర‌సుంద‌రి, అక్టోబ‌రు 10న శ్రీ‌మ‌హాల‌క్ష్మి, అక్టోబ‌రు 11న శ్రీ అన్న‌పూర్ణాదేవి, అక్టోబ‌రు 12న శ్రీ స‌ర‌స్వ‌తిదేవి, అక్టోబ‌రు 13న‌ శ్రీ దుర్గాదేవి, అక్టోబ‌రు 14న శ్రీ మ‌హిషాసురమ‌ర్ధిని, అక్టోబ‌రు 15న శ్రీ రాజ‌రాజేశ్వ‌రి దేవి అలంకారాల్లో అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.