TTD TIES UP WITH HEALTH INSURANCE CO FOR CASHLESS MEDICARE AT SVIMS _ స్విమ్స్‌లో న‌గ‌దుర‌హిత‌ వైద్య‌సేవ‌లకు ఇన్సూరెన్స్ సంస్థలతో ఒప్పందం

Tirumala, 2, December 2021: TTD has tied up with several mega health insurance companies to facilitate cashless Medicare to patients at the SVIMS hospital.

On the directions of the TTD EO Dr KS Jawahar Reddy, cashless Medicare has commenced at the premier super speciality hospital.

Henceforth all patients who had obtained health insurance policies could avail cashless  medical services at SVIMS

The cashless medical services were effectively implemented under the supervision of SVIMS director Dr Vengamma.

The prominent health insurance companies that had entered into a tie-up with SVIMS were – IFCO-Tokyo, Future General, Safeway, Good health, Bajaj Alliance, Heritage, Family Health Plan Insurance, Reliance General Insurance, and Medi Assist Insurance.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

స్విమ్స్‌లో న‌గ‌దుర‌హిత‌ వైద్య‌సేవ‌లకు ఇన్సూరెన్స్ సంస్థలతో ఒప్పందం

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 02: టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ వేంక‌టేశ్వ‌ర వైద్య విజ్ఞాన సంస్థ‌(స్విమ్స్‌)లో గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా న‌గ‌దు ర‌హిత వైద్య‌సేవ‌లు అందుతున్నాయి.

హెల్త్ ఇన్సూరెన్స్ రంగం భాగ‌స్వామ్యంతో స్విమ్స్‌లో వైద్య‌సేవ‌ల‌ను మ‌రింత విస్తృతప‌ర‌చాలని ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి. స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గానికి వైద్య‌సేవ‌లు అందించేందుకు ఇన్సూరెన్స్ నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రిగా స్విమ్స్ న‌మోదు చేసుకుంది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ క‌లిగి ఉన్న రోగులు న‌గ‌దు ర‌హిత వైద్య‌సేవ‌లను వినియోగించుకోవచ్చు.

స్విమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వెంగ‌మ్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న‌గ‌దు ర‌హిత వైద్య‌సేవ‌ల విధానం ప‌టిష్టంగా అమ‌ల‌వుతోంది.

ఒప్పందం చేసుకున్న ప్ర‌ముఖ ఇన్సూరెన్స్ సంస్థ‌లు

స్విమ్స్ ఆసుప‌త్రి ఒప్పందం చేసుకున్న సంస్థ‌ల్లో ఇఫ్కో – టోకియో, ఫ్యూచ‌ర్ జ‌న‌ర‌లి, సేఫ్‌వే, గుడ్ హెల్త్‌, బ‌జాజ్ అల‌య‌న్స్‌, హెరిటేజ్‌, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్‌, రిల‌య‌న్స్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్, మెడి అసిస్ట్ ఇన్సూరెన్స్‌ ఉన్నాయి. మ‌రిన్ని ఇన్సూరెన్స్ సంస్థ‌ల‌తో ఒప్పందం చేసుకునేందుకు స్విమ్స్ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.