TTD to build Balaji temple at Prajag _ త్వరలో అలహాబాదులో శ్రీవారి ఆలయం : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు 

 Tirumala model Balaji temple inaugurated at Kumbh Mela grounds

  • Dr Bansal of Allahabad offers donation of  ten acres for permanent  temple building
  • Daily rituals at  Prayag  makeshift  temple  till March  10
  • 140 Hindi titles  available at TTD publications  sale stall

 

Allahabad, January 27: Tirumala Tirupati Devasthananams will build a temple of Lord Balaji (Venkateswara) at Prayag(Allahabad) with support from the Government of Uttar Pradesh.

 

Announcing this at a media meet in the Maha Kumbha Mela grounds the TTD  Chairman Sri Kanamuri Bapiraju said that the daily rituals on par with Tirumala Temple will also be performed at the Balaji temple replica installed at sector six of the Kumbha Mela grounds.

 

He said Annadanam will also be performed for all devotees at the Balaji temple complex at Sector six as at Tirumala where nearly 50,000 persons were enjoying Anna Prasadam every day.

 

Enthused by the TTD decision a doctor of Allahabad, Dr. Bansal had come forward to donate ten acres of land in Prayag for constructing temple of  Lord Venkateswara.

 

Later addressing media persons the TTD executive officer Sri L V Subramanyam said  that TTD has plans to set up permanent temples for Sri Venkateswara (Balajai) at Kanyakumari, Mumbai and Delhi to facilitate the devotees thrust for darshan of the holiest deity. ‘TTD will also continue its mission of conducting  Srinivasa Kalyanams  at all important towns and cities in the country for the benefit of the huge devotee followers of the Lord.

 

The TTD has set up its publication stall where in nearly 140 title publications in Hindi were made available for sale at the Mela grounds.

 

Prominent citizens of Prayag including Mahamandaleswar Swamy, Major General Dayal and Col, Krishna, Superintending Engineer of TTD  G.Ramachandra Reddy,  OSD (rituals)  Sri Sheshadri, AEO Sri Lakshminaryana Yadav, Dy EO Sri Umapathy Reddy, PRO Sri. T Ravi participated.

 

ISSUED  BY THE  PRO , TTDS, CAMP  ALLAHABAD

త్వరలో అలహాబాదులో శ్రీవారి ఆలయం : తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు

అలహాబాదు, జనవరి 27, 2013: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని త్వరలో అలహాబాదులో నిర్మించేందుకు కృషి జరుగుతున్నట్టు తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనంగా  శ్లాఘించబడుతున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, అలహాబాదు నగరంలోని కుంభమేళాలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని ఆదివారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు ప్రసంగిస్తూ కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు (బాలాజీ) మొదటిసారిగా అలహాబాదులోని కుంభమేళాలో కొలువుదీరడం సంతోషకరమన్నారు. ఇక్కడి సెక్టార్‌-6 ప్రాంతంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కలిగిందన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న తరహాలోనే ఇక్కడ కూడా ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తిరుమలకు రాలేని భక్తులు ఈ ఆర్జితసేవల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నట్టు వివరించారు. అలహాబాదులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థానిక పత్రికాధిపతి డాక్టర్‌ బన్సాల్‌ పది ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడం భగవంతుడి కరుణా కటాక్షమేనన్నారు.

తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ మహాకుంభమేళాలో  ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో సుమారు 200 మంది తితిదే సిబ్బంది భక్తులకు సేవలందిస్తున్నట్టు తెలిపారు. ఉత్తరాది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన ఈ నమూనా ఆలయం 45 రోజుల పాటు ఉంటుందని, ఆ తరువాత శ్రీవారి శాశ్వత ఆలయ నిర్మాణానికి ప్రయత్నిస్తామని వివరించారు.
కాగా ఆలయ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ మహామండలేశ్వరస్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేస్తూ శ్రీవారి దయ మనందరిపైనా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నట్టు తెలిపారు. పెద్ద సంఖ్యలో స్థానిక స్వామీజీలు, అర్చకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తితిదే పుస్తక విక్రయశాలలను ఆర్మీ జనరల్‌ కమాండ్‌ ఆఫీసర్‌ శ్రీ దయాళ్‌ ప్రారంభించారు.
త్రివేణీ సంగమంలో శ్రీ భోగశ్రీనివాసమూర్తి పుణ్యస్నానం
ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీ భోగశ్రీనివాసమూర్తి, చక్రత్తాళ్వార్లు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. వేదపండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా శాస్త్రోక్తంగా పుణ్యస్నాన ఘట్టం జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తితో పాటు తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకటరామిరెడ్డి పుణ్యస్నానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్మీ కల్నల్‌ శ్రీ కృష్ణన్‌, కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రత్యేకాధికారి శ్రీ పాల శేషాద్రి, తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాథ్‌, సూపరింటెండెంట్‌ ఇంజినీర్లు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, ఎస్వీబీసీ లైజాన్‌ ఆఫీసర్‌ శ్రీ వెంకటశర్మ, వేదపండితులు పాల్గొన్నారు.
 
అలహాబాదులోని కుంభమేళా నుండి తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.