TTD TO INTER-LINK ARJITHA SEVAS OF OTHER TEMPLES-TTD EO _ డయల్‌ యువర్‌ ఇ.ఓ

TIRUMALA, MARCH 1:    With an aim to popularise the arjitha sevas that are being performed in other TTD-run temples among the pilgrims, TTD is contemplating to inter-link arjitha seva tickets vacancies in the information counters, said TTD EO Sri LV Subramanyam.
While attending to the phone calls by various pilgrim callers as a part of Dial Your EO Programme held at Annamaiah Bhavan in Tirumala on Friday, answering a caller Mr. Sudarshan Reddy from Kadapa, the EO said, as the arjitha sevas tickets of Suprabhatam, Thomala, Archana which are performed in Tirumala are available in very limited numbers, it is not easy to enhance the sevas tickets in the internet booking.
However the EO said, TTD is planning to inter-link the arjitha seva vacancies available in other TTD run famous temples including Tiruchanoor, Mangapuram, Govinda Raja Swamy temple etc. for the sake of the pilgrims.
Answering another query by Mr Damodaran from Chennai, the EO said TTD will definitely take measures to streamline the existing queue line in the Angapradakshinam tokens issuing counter for the convenience of pilgrims especially the women and children.
Meanwhile many callers complimented the spiritual programmes that are being aired by TTD’s SV Bhakti Channel. The callers, Mr Parameshwara Rao from Orissa, Padmaja from US appreciated the programmes that are being telecasted by SVBC. Welcoming their remarks, TTD EO said, the intention of TTD is to provide a peaceful and
spiritual environment in every household which is very much needed for the good of the society.
TTD EO answering to the query of Mr Krisnappa from Bangalore said, TTD has already had fruitful discussions with ASI Director at New Delhi over the development of Srinivasa Mangapuram temple.”Very soon all amenities required for the pilgrims who are visiting this temple and trekking Tirumala through Srivari Mettu will be made”, he added.
—————————
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డయల్‌ యువర్‌ ఇ.ఓ

తిరుమల, 2013 మార్చి 01: శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమంలో భక్తులు చేసిన కొన్ని సలహాలు, సూచనలు, సందేహాలకు తితిదే ఇ.ఓ శ్రీఎల్‌.వి.సుబ్రహ్మణ్యం స్పందన
1. దామోదరన్‌ – చెన్నై
అంగప్రదక్షిణం టికెట్లు మంజూరు చేసే కేంద్రంలో క్యూలైన్లు క్రమబద్ధీకరించగలరు.
ఇ.ఓ. తప్పకుండా ఏర్పాటుచేస్తాం
2. జగన్నాథం – అమలాపురం
తిరుమలలోని పలు హోటళ్లలో ఆహార నాణ్యతపై దృష్టి సారించగలరు.
ఇ.ఓ. ఇటీవల అన్ని హోటళ్లకు సంబంధించి శాంప్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఆహారపదార్థాలను చెన్నై, హైదరాబాద్‌, తదితర ప్రాంతాలకు పంపించి నాణ్యతను పరీక్షిస్తున్నాం. త్వరలో తిరుమలలోని హోటళ్లలో ఆహార నాణ్యతలో గణనీయమైన మార్పును పరిశీలించగలరు.
3. పరమేశ్వరరావు – ఒరిస్సా
ఎస్వీ భక్తి చానల్‌ ప్రసారాలు అద్భుతంగా ఉంటున్నాయి.
ఇ.ఓ. చాలా సంతోషం. మీ వంటి భక్తుల ప్రోత్సాహంతో మరిన్ని ఉన్నతమైన కార్యక్రమాలు అందిస్తాం.
4. కృష్ణప్ప – బెంగళూరు
శ్రీనివాసమంగాపురంలో కాలిబాట మార్గంలో వెళ్లే యాత్రికుల కొరకు మరిన్ని స్నానపుగదులు, మరుగుదొడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేయగలరు.
ఇ.ఓ. తితిదే ఇప్పటికే ఆ మేరకు తగిన చర్యలు చేపట్టింది. మరో రెండు మూడు నెలల వ్యవధిలో సత్ఫలితాలను గమనించగలరు.
5. పద్మజ – అమెరికా
ఎస్వీ భక్తి చానల్‌లో ప్రసారమవుతున్న కార్యక్రమాలు విదేశాల్లో ఉన్నా, తమకు తిరుపతిలోనే ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. అందుకు తితిదేకి ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఎస్వీబీసీలో ఆనందనిలయ విమాన వేంకటేశ్వరుని దర్శనభాగ్యాన్ని కూడా మాకు కల్పించగలరు.
ఇ.ఓ. పరిశీలిస్తాం.
6. ఇందిరా లక్ష్మి – తిరుపతి
తిరుపతి వంటి ప్రఖ్యాత క్షేత్రంలో కూడా అతిరాత్ర మహాయాగాన్ని నిర్వహించగలరు.
ఇ.ఓ. ఇప్పటికే అద్భుత శాంతియాగం, కారీరీష్టి యాగం, ఇష్టియాగం వంటి మహత్తర యాగాలను తితిదే నిర్వహిస్తూ హైందవ సనాతన ధర్మ విలువలను కాపాడుతున్నది. అతిరాత్ర యాగం నిర్వహించడానికి ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా చేస్తాం.
7. సుదర్శన్‌రెడ్డి – కడప
ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానంలో సుప్రభాతం వంటి సేవా టికెట్ల మోతాదును పెంచగలరు.
ఇ.ఓ. ఈ ఆర్జితసేవా టికెట్లు పరిమిత సంఖ్యలో ఉన్న కారణంగా అటువంటి వెసులుబాటు లేదు. అయితే తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, గోవిందరాజస్వామివారి ఆలయం వంటి తితిదే ఆధ్వర్యంలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లోని సేవలను సమాచార కేంద్రాలకు అనుసంధానం చేసి ఆ సేవా టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడతాం.
8. అరుణకుమారి – సికింద్రాబాద్‌
వయోవృద్ధులు తిరుమలకు వచ్చినప్పుడు వారి సౌకర్యార్థం లగేజి కౌంటర్లను గ్రౌండ్‌ఫ్లోర్లలోనే ఏర్పాటు చేయగలరు.

ఇ.ఓ. ఇప్పటికే ఈ సౌకర్యాన్ని పాత అన్నప్రసాద కేంద్రం స్థానే నిర్మించిన పిఏసి-4లో భక్తుల కొరకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అంతేకాకుండా పిఎసి -1, 2, 3లలో కూడా లిఫ్టు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.