TULASI MAHATYAM UTSAVAM _ ఆగస్టు 16న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం
Tirupati, 08 August 2024: Sri Tulasi Mahatyam festival will be celebrated on August 16 at Sri Govindaraja Swamy temple in Tirupati.
On Shravana Shuddha Dwadasi, special programs will be organized in the temple to commemorate the occasion of the emergence of Tulsi.
As part of this, from 7.30 am to 9 am Sri Govindaraja Swamy atop the Garuda Vahana bless the devotees along the four mada streets of the temple.
After that, from 9 am to 10 am, Swamivari Asthanam will be held.
In this the priests recite Tulasi Mahatyam Puranam. After that, Theertha Prasadams will be given to the devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 16న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం
తిరుపతి, 2024, ఆగస్టు 08: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీ తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.