TWO-DAY TRAINING PROGRAM FOR GOSHALA OPERATORS _ మార్చి 30, 31వ తేదీల్లో శ్వేత‌లో గో ప్రాముఖ్య‌త స‌ద‌స్సు

Tirupati, 29 March 2022: TTD is organising a two-day training program for organic farmers and Goshala operators from all over Andhra Pradesh on March 30 & 31 at SVETA Bhavan.

The focus of the training program will be on Go-based organic farming, panchagavya products and their marketing.

Two representatives from model Goshala are chosen from each district for the training who in turn are expected to conduct such sessions in their districts for benefit of other Goshala operators on the significance of Organic farming, Panchagavya products etc.

Representatives of Venu Madhavi trust of Kolhapur, in Maharashtra and several Goshala operators of AP are expected to showcase their Panchagavya products during the training session.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 30, 31వ తేదీల్లో శ్వేత‌లో గో ప్రాముఖ్య‌త స‌ద‌స్సు

తిరుపతి, 2022 మార్చి 29: తిరుప‌తి శ్వేత భ‌వ‌నంలో మార్చి 30, 31వ తేదీల్లో టిటిడి ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు మ‌రియు గోఆధారిత వ్య‌వ‌సాయ‌దారుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో గో ప్రాముఖ్య‌త‌, గోఆధారిత వ్య‌వ‌సాయం, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల తయారీ, మార్కెటింగ్‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు. ప్ర‌తి జిల్లా నుండి రెండు ఆద‌ర్శ గోశాల‌లకు చెందిన ప్ర‌తినిధులు ఈ స‌ద‌స్సులో పాల్గొంటారు. ఈ స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌తినిధులు త‌మ జిల్లాలోని ఇత‌ర గో శాల నిర్వ‌హ‌కుల‌కు పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులపై శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సంద‌ర్బంగా మ‌హారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన వేణుమాధ‌వి ట్ర‌స్టు ప్ర‌తినిధులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ గో శాలల‌ నిర్వ‌హ‌కులు త‌మ పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.