TWO DAYS FOR SARVA DARSHAN _ తిరుమలలో పెరిగిన భక్తుల ర‌ద్దీ

TIRUMALA, 07 OCTOBER 2022: With the weekend coupled with Third Pertasi Saturday, Tirumala has been witnessing an unprecedented pilgrim rush for the past two days.

It is taking nearly 48hours for the pilgrims coming in Sarva Darshan. TTD has appealed to devotees to be patient till their turn for Darshan.

TTD EO inspected the lines on Friday evening and also appealed to the pilgrims that they shall enter the queues only in the morning of October 8 and till that time they shall rest in Pilgrim Amenities  Complexes.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో పెరిగిన భక్తుల ర‌ద్దీ 
 
– శ్రీవారి దర్శనానికి 48 గంటలు
 
– భక్తులు సంయమనంతో క్యూలైన్లలో వేచి ఉండాలి
 
తిరుమల, 07 అక్టోబర్ 2022: పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస  సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
 
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని  షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం   క్యూలైన్లు గోగర్భం డ్యామ్  వద్దకు చేరుకున్నాయి.
 
తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు తమవంతు వచ్చే వరకు  సంయమనంతో ఉండాలని కోరడమైనది. భక్తులు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం క్యూలైన్లలోకి ప్రవేశించాలని కోరడమైనది.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.