UGADI ASTHANAM ON APRIL 13 _ ఏప్రిల్ 13న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Tirumala, 11 Apr. 21: Plavanama Samvatsara Ugadi Asthanam will be observed in Tirumala temple on April 13.

The traditional temple court will be observed between 7am and 9am at Bangaru Vakili inside the temple in the presence of Sri Malayappa, Sridevi, Bhudevi accompanied by Vishwaksenulavaru. 

TTD has cancelled all arjitha sevas (virtual) on that day following Asthanam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 13న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల, 2021 ఏప్రిల్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీన మంగ‌ళ‌వారం శ్రీ ఫ్ల‌వ‌నామ  సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని ఏప్రిల్ 13వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే  ‌ఆర్జిత సేవలైన (వ‌‌ర్చువ‌ల్ సేవ‌లు) కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాల‌ను  టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.