UNPRECEDENTED PILGRIM RUSH IN TIRUMALA _ తిరుమలలో అనూహ్య రద్దీ

TIRUMALA, 13 AUGUST 2022: The hill temple of Sri Venkateswara Swamy at Tirumala has been witnessing an unprecedented rush with a series of holidays couple with weekend.

 

On Saturday the serpentine lines have reached even the outer ring road near the Octopus building. It is taking nearly two days for the devotees. As per the 8pm status 56,546 pilgrims had Darshan on August 13.

 

TTD has again appealed to devotees to postpone their pilgrimage in view of an unprecedented surge in pilgrim footfall due to series of holidays.

 

 

TTD Trust Board Chairman Sri YV Subba Reddy said in view of unprecedented rush pilgrim in Tirumala due to series of holidays TTD has cancelled has VIP Break Darshan on recommendation letters till August 21 to give Darshan priority to common pilgrims.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తిరుమలలో అనూహ్య రద్దీ

ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు : టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 2022 ఆగ‌స్టు 13: వారాంతంలో వరుస సెలవుల రావడంతో తిరుమలలో అనూహ్యమైన రద్దీ నెలకొందని, సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 21వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.

శనివారం ఆక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు భక్తుల క్యూలైన్ చేరుకుంది. శ్రీవారి దర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతోంది. రాత్రి 8 గంటల వరకు 56,546 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు.

వరుస సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో తమ యాత్రను వాయిదా వేయాలని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.