VAIKUNTADWARA DARSHAN FOR DONORS _ దాతలకు వైకుంఠద్వార దర్శనం, బస వివరాలు
Tirumala,17 November 2023: TTD has made certain arrangements with respect to Vaikuntadwara Darshan and accommodation for Donors of TTD.
Donors shall be allowed in ₹300 special entry darshan for Darshan and will be provided Maha Laghu Darshan.
In view of the anticipation of large pilgrim crowd for Vaikunta dwara Darshan, there will be no room allotments for donors or on their letters from December 21-24 (two days ahead of Vaikunta Ekadasi up to Dwadasi).
Similarly from December 30 to January 1, 2024 also there will be no special room allocations for donors or their recommendation letters.
The donors and their representatives could avail of rooms on the remaining days.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
దాతలకు వైకుంఠద్వార దర్శనం, బస వివరాలు
తిరుమల, 2023 నవంబరు 17: వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబరు 23 నుండి జనవరి ఒకటో తేదీ వరకు టీటీడీ ట్రస్టులు, స్కీముల దాతలకు కల్పిస్తున్న ప్రయోజనాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో దర్శనం బుక్ చేసుకున్న దాతలను రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. దాతలందరికీ జయవిజయుల వద్ద నుండి మహాలఘు దర్శనం కల్పిస్తారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు పెద్దపీట వేయడంలో భాగంగా వైకుంఠ ఏకాదశి రెండు రోజుల ముందు నుండి ద్వాదశి వరకు అనగా డిసెంబరు 21 నుండి 24వ తేదీ వరకు, అదేవిధంగా డిసెంబరు 30 నుండి 2024, జనవరి ఒకటో తేదీ వరకు దాతలకు, వారి సిఫార్సు లేఖలతో వచ్చే వారికి గదుల కేటాయింపు ఉండదు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.