TTD EO SINGHAL PRESENTS PATTU VASTRAM TO SRI KALAHASTI TEMPLE_ శ్రీకాళహస్తీశ్వరునికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

Srikalahasti, 6 Mar. 19: TTD Executive Officer, Sri Anil Kumar Singhal today presented traditional pattu vastrams (silk) to Sri Bramaramba sametha Lord Kalahastheeswara at Sri Kalahasti as part of annual Brahmotsavams.

On his arrival at the temple, Sri Singhal was received with temple honours by the Sri Kalahastheeswara Swamy temple EO Sri Ramaswami and Archakas.T hey also presented him with Thirtha prasadams after the darshan of the Lord.

The Mahashivaratri Brahmotsavams of the Sri Kalahastheeswara temple, which commenced from February 27, will conclude by March 11.

Speaking on the occasion the TTD EO said that it was a traditional practice that since last 19 years the TTD presented traditional silks to the Sri Kalahastheeswara temple during the Brahmotsvams.

OSD of Srivari Temple Sri Pala Seshadri, Bokkasam in charge Sri Gururaja Rao and others participated in the event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీకాళహస్తీశ్వరునికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

మార్చి 06, తిరుపతి, 2019: శ్రీకాళహస్తిలోని భ్రమరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణోత్సవం సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు ఆలయ ఈవో శ్రీరామస్వామి, అర్చకబృందం కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను టిటిడి ఈవోకు అందించారు. శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 27న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీనివాసుడి సోదరి అయిన భ్రమరాంబ సౌభాగ్యం కోసం శ్రీవారు పట్టువస్త్రాలు పంపుతున్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీగురురాజారావు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.