VEDA VIDWAT SADASSU IN 2020 _ అక్టోబ‌రు 20 లోపు వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

Tirumala, 12 Oct. 19: The 28th Veda Vidwat Sadassu will be organised by Dharmagiri Veda Vignana Peetham between February 25 to March 1 in 2020.

Exams will be conducted n 37 Veda Sakhas during this Sadassu. The certificates of these exams will be helpful to get priority as Archakas during the appointments taken up by AP Endowments Department and TTD in future. The last date for registration for taking part in this Sadassu will be on October 20. 

For more information, please visit TTD official Website www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అక్టోబ‌రు 20 లోపు వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలోని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ఆధ్వ‌ర్యంలో 2020 ఫిబ్ర‌వ‌రి 25 నుండి  మార్చి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న 28వ  శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు( ప‌రీక్ష‌లు)కు అక్టోబ‌రు 20వ తేదీ సాయంత్రంలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలియ‌జేయ‌డ‌మైన‌ది.

 ఈ స‌ద‌స్సులో 37 వేద శాఖ‌లకు సంబంధించిన ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించిన అభ్య‌ర్థుల‌కు ఏ గ్రేడ్ స‌ర్టిఫికెట్లు ప్ర‌దానం చేస్తారు. భ‌విష్య‌త్తులో టిటిడి, రాష్ట్ర దేవాదాయ శాఖ‌ ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల‌లో అర్చ‌కుల నియామ‌కానికి ఏ గ్రేడ్ స‌ర్టిఫికెట్ క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం అధికారులు తెలిపారు. గ‌తంలో 27 సార్లు శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సులు జ‌రిగాయి. ఇత‌ర వివ‌రాల‌కు టిటిడి వెబ్‌సైట్  www.tirumala.org ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.