VEDANTA DESIKAR SATTUMORA ON NOVEMBER 11 _ న‌వంబ‌రు 11న శ్రీ వేదాంత దేశికర్ సాత్తుమొర‌

TIRUPATI, 03 NOVEMBER 2021: As part of Salakatla utsavams, Vedanta Desikar Sattumora will be observed on November 11 in Sri Govindaraja Swamy temple at Tirupati.

 

This annual fete commenced on November 2 and will conclude on November 11. Due to Covid 19 restrictions, these utsavams will be observed in Ekantam only.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 11న శ్రీ వేదాంత దేశికర్ సాత్తుమొర‌

తిరుపతి, 2021 నవంబరు 03: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీవేదాంత దేశికర్‌ ఆలయంలో సాలకట్ల ఉత్సవాల సంద‌ర్భంగా న‌వంబ‌రు 11వ తేదీన సాత్తుమొర జ‌రుగ‌నుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఘంటా స్వరూపులు శ్రీవేదాంతదేశికర్‌. వీరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

న‌వంబ‌రు 2వ తేదీ నుండి ఆల‌యంలో సాల‌క‌ట్ల ఉత్స‌వాలు జరుగుతున్నాయి. ఉత్స‌వాల చివ‌రి రోజైన న‌వంబ‌రు 11న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీవేదాంత దేశికర్‌ ఆలయానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పా పడిని ఊరేగింపుగా తెచ్చి శ్రీ వేదాంత దేశికర్‌ వారికి సమర్పిస్తారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

శ్రీవేంకటేశ్వరస్వామివారు జన్మించిన భాద్రపద మాసం శ్రవణ నక్షత్రంలోనే శ్రీవేదాంత దేశికర్‌ సుమారు 750 సంవత్సరాల క్రితం కాంచీపురంలోని తూప్పుల్‌ అగ్రహారంలో పుట్టారు. ఈయన స్వామివారిని కీర్తిస్తూ దయా శతకం అనే స్తోత్రం రచించారు. శ్రీవారి సుప్రభాతం రచించిన శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్‌కు శ్రీ వేదాంత దేశికర్‌ గురువర్యులు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.