VEDASIRVACAHANAM RENDERED TO CM_ రాష్ట్రంలోని ప్రజలు సిరి సంపదలతో ఆనందంగా జీవించాలి : రాష్ట్ర ముఖ్యమంత్రి వ‌ర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు

Tirupati, 15 January 2019: A team of vedic pundits of TTD, rendered Vedasirvachanam to Honourable CM of AP Sri N Chandrababu Naidu and his family on the occasion of Sankranthi in his residence at Naravaripalle in Chandragiri on Tuesday.

The CM wished the people of Andhra Pradesh to be blessed with good rains, harvest and prosperity.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

రాష్ట్రంలోని ప్రజలు సిరి సంపదలతో ఆనందంగా జీవించాలి : రాష్ట్ర ముఖ్యమంత్రి వ‌ర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు

తిరుపతి, 2019 జనవరి 15: ప్రజలందరు సిరిసంపదలతో ఆనందంగా జీవించాలని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని కోరుకున్నట్లు రాష్ట్ర ముఖ్యంత్రి వర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారిపల్లిలోని ఆయన గృహంలో మంగ‌ళ‌వారం ఉద‌యం టిటిడి వేద పండితులు వేదశీర్వాచనం, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన వేద పండితుల వేదశీర్వాచనం తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందని, ఇది త‌న‌కు శ్రీవారు కల్పించిన భాగ్యం అన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేసి అవి వారికి అందేల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌యం ఒఎస్డి శ్రీ పాల శేషాద్రి, టిటిడి అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.