VEERABHADRA SWAMY BTUs FROM AUGUST 9-17 _ ఆగస్టు 9 నుండి 17వ తేదీ వ‌ర‌కు శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 05 AUGUST 2024: Narayanavanam-based Sri Bhadra Kali sameta Sri Veerabhadra Swamy annual fest will be observed between August 9 to 17 in a grand manner by TTD.
 
The annual brahmotsavams will commence with Ankurarpanam on August 9 followed by Dhwajarohanam at 6pm. Later Chandra Prabha Vahanam takes place from 7.30pm onwards.
 
Every day the morning vahanams are between 9.30am and 10.30am in the morning and evening vahanam from 7pm to 9.30pm.
 
The important festival days includes Agni Gunda Pravesam on August 13 followed by Puli Vahanam, Rathotsavam on August 15 at 3pm, followed by Kalyanotsavam in the evening. The devotees can participate on the payment of Rs.500 per ticket on which two persons will be allowed.
 
On the last day on August 17, Veera Khadga Snanam will be performed followed by Pallaki Utsavam and Dhwajavarohanam in the night.
 
TTD All Dharmic projects will organise devotional cultural programmes on these days.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 9 నుండి 17వ తేదీ వ‌ర‌కు శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 ఆగస్టు 05: నారాయణవనం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 9 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

ఆగస్టు 9వ తేదీ ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 7.30 నుండి 10 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

ఇందులో భాగంగా ఆగస్టు 10వ తేదీ రాత్రి సింహవాహనం, ఆగస్టు 11న రాత్రి భూత వాహనం, ఆగస్టు 12న రాత్రి శేష వాహనం, ఆగస్టు 13న రాత్రి 7 గంటలకు అగ్నిగుండం ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు. అదేవిధంగా ఆగస్టు 14న రాత్రి గజవాహనం, ఆగస్టు 15న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, అనంతరం రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, లడ్డూ, అప్పం ప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.

ఆగస్టు 16న సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌సంతోత్స‌వం, రాత్రి 7 గంట‌ల‌కు అశ్వవాహనం, ఆగస్టు 17న ఉదయం 10 గంటలకు వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం 3 గంటలకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 గంట‌ల‌కు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం హరికథలు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల