VENGAMAMBA JAYANTI ON MAY 25 AT TIRUMALA _ మే 25న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 291వ జయంతి

Tirumala, 24 May 2021:  TTD is organising the 291st Jayanti celebrations of Matrusri Tarigonda Vengamamba, an ardent disciple of Sri Venkateswara on May 25 at Tirumala.

The utsava fetes will be observed in adherence to Covid guidelines at the Ranganayakula Mandapam in Srivari temple, Vengamamba Brindavan at Tirumala and Annamacharya Kala mandiram at Tirupati.

The garlanding ceremony will be held at Vengamamba Brindavanam of the saint poetess at Tirumala between 9am and 10am in Ekantam. 

In the evening Sri Malayappa and His consorts will be paraded along the Mada streets and thereafter Vengamamba Jayanti festivities will be observed also in Ekantam at Ranganayakula Mandapam instead of Narayanagiri Gardens in view of Covid.

Matrusri Tarigonda Vengamamba was born in 1730 in the Chittoor district of Andhra Pradesh. She had attained live samadhi like Sri Raghavendra Swami and Sri Veerabrahmendraswami in 1817. She also pioneered Anna Prasadam for devotees visiting Tirumala.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 25న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 291వ జయంతి

తిరుమల, 2021 మే 24: శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి అపరభక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 291వ జయంతి ఉత్సవం మే 25న తిరుమలలో జరుగనుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో, తిరుమల వెంగ‌మాంబ బృందావ‌నంలో, తిరుపతి అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఏకాంతంగా పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంట‌ల నుండి ఉభయనాంచారులతో కూడిన శ్రీమలయప్ప స్వామివారిని ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేప‌డ‌తారు. అనంత‌రం ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఏకాంతంగా వెంగ‌మాంబ జ‌యంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు ప్రదర్శించిన వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి లాగా తన బృందావనంలోనే 1817వ సంవ‌త్స‌రంలో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.