VENKATESWARA SWAMY IS PRATYAKSHA VEDA SWARUPA-Dr VELUKKUDI KRISHANAN _ ప్ర‌త్య‌క్ష వేద స్వ‌రూపుడు శ్రీ వేంక‌టేశ్వ‌రుడు : ఆచార్య వేలుక్కుడి కృష్ణ‌న్‌

Tirumala, 3 Oct. 19: Sri Venkateswara Swamy is an embodiment of Vedas said renowned Tamil Spiritual scholar, Upanyasa Kesari Dr Velukkudi Krishnan.

He explained the importance of Vedas exemplifying relevant stories from Puranas.  The scholar said Lord Venkateswara is Prayaksha Veda Swarupa and hence Venkatadri is also known as Vedadri.

Lord is omnipresent. He is in the form of rich green vegetation in Naimisaranya,  as Water in Pushkar and in all other forms. Only we have to develop the wisdom to identify the omnipresence of Lord,  he added. 

Adding further, he said, the daily worship to the lord, the dance troupes performing in front of vahana sevas are also Bhakti Nivedanas.

Sri Chakravarthi Ranganathan translated his discourse briefly in Telugu. TTD Estates Officer Sri Vijayasaradhi felicitated the spiritual scholar. Higher Vedic Studies Project Officer Dr A Vibhishana Sharma was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

ప్ర‌త్య‌క్ష వేద స్వ‌రూపుడు శ్రీ వేంక‌టేశ్వ‌రుడు : ఆచార్య వేలుక్కుడి కృష్ణ‌న్‌

 తిరుమల, 2019 అక్టోబ‌రు 03:    క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షాత్తు వేద స్వ‌రూపుడని త‌మిళ‌నాడులోని శ్రీ‌రంగానికి చెందిన ఆచార్య వేలుక్కుడి కృష్ణ‌న్‌స్వామి పేర్కొన్నారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో జ‌రుగుతున్న‌ శ్రీ‌నివాస వేద విద్వ‌త్ స‌ద‌స్సు గురువారం నాలుగో రోజుకు చేరుకుంది.

 ఈ సందర్భంగా ఆచార్య వేలుక్కుడి కృష్ణ‌న్ మాట్లాడుతూ ప్ర‌స్తుత స‌మాజానికి వేదాల ఆవ‌శ్య‌క‌త అనే అంశంపై ఉప‌న్య‌సించారు. శ్రీ‌వారు కొలువైన వేంక‌టాద్రిని వేదాద్రిగా పురాణాల్లో పేర్కొన్నార‌ని చెప్పారు. స్వామివారు స‌ర్వాంత‌ర్యామి అని, నైమిషార‌ణ్యంలో ప‌చ్చ‌ని వృక్షాలుగా, పుష్క‌రిణిలో ప‌విత్రజ‌లంలా ప‌లు రూపాల్లో ఉంటార‌ని వివ‌రించారు. స్వామివారిని గుర్తించ‌గ‌లిగే జ్ఞానాన్ని మనం పెంచుకోవాల‌న్నారు. రోజువారీ ప్రార్థ‌న చేయ‌డం, వాహ‌న‌సేవ‌ల్లో క‌ళ‌రూపాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం కూడా భ‌క్తినివేద‌న‌లో భాగ‌మేన‌న్నారు. కాగా, వీరి ప్ర‌సంగాన్ని శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ తెలుగులోకి అనువ‌దించారు. ఆ త‌రువాత ఆచార్య వేలుక్కుడి కృష్ణ‌న్‌స్వామిని టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి స‌న్మానించారు.

 ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.