VIG SLEUTHS NAB DALARIS _ తిరుమ‌ల‌లో ముగ్గురు దళారులపై కేసు న‌మోదు

TIRUMALA, 14 FEBRUARY 2022: Tirumala Vigilance Wing sleuths caught hold of four dalaris in two different incidents and lodged complaints against them in Tirumala Police station on February 12

 

In one of the cases, when the on duty Vigilance personnel were verifying VIP Break Darshan tickets at ATC circle, on suspicion came to know that one dalari Viswasanthi Kumar forged the letter of a Public Representative from Kurnool and arranged Break Darshan to Sri.B. Pavan Kumar of Hyderabad for which he demanded Rs.10000/- towards 5 tickets. They paid Rs.5500/- through phone pe and the remaining after darshan. On complaint, a case was registered in Cr.no 18/2022 U/S 420,468,471 IPC at Tirumala II Town PS.

 

In another case, one complainant Sri YH Venkatesh aged 34 from Mangalore came to Vigilance Wing office at Tirumala and gave a complaint that dalaries Reddy Eswar, Babu Naik and Sudarshan Reddy (taxi drivers) from Tirupati promised them to arrange darshan tickets and took Rs.3200/- cash and gave a fake and fabricated ticket. In this case vigilance wing, filed a complaint. A case was registered in Cr.no 19/2022 U/S 420,468r/w 34 IPC at Tirumala ll town PS against these three middlemen.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమ‌ల‌లో ముగ్గురు దళారులపై కేసు న‌మోదు

తిరుమ‌ల‌, 2022 ఫిబ్ర‌వ‌రి 14: తిరుమలలో ముగ్గురు ద‌ర్శ‌న టికెట్ల‌ దళారులపై టిటిడి విజిలెన్స్ విభాగం తిరుమలలోని టు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమ‌వారం ఫిర్యాదు చేశారు.

తిరుపతికి చెందిన (టాక్సీ డ్రైవర్లు) దళారులు రెడ్డి ఈశ్వర్, బాబు నాయక్, సుదర్శన్ రెడ్డిలు రూ.3200/- నగదు తీసుకుని నకిలీ టిక్కెట్లను విక్ర‌యించిన‌ట్లు మంగళూరుకు చెందిన శ్రీ వై.హెచ్. వెంకటేష్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాత్రికుల ఫిర్యాదు మేరకు టిటిడి విజిలెన్స్ అధికారులు ముగ్గురు ద‌ళారుల‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమ‌వారం తిరుమల టు టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో Cr.no 19/2022 U/S 420,468r/w 34 IPC క్రింద కేసు నమోదైంది.

అదేవిధంగా సోమ‌వారం ఉద‌యం తిరుమల ఏటిసి సర్కిల్‌లో వ‌ద్ద బ్రేక్ దర్శనం టిక్కెట్లు వెరిఫై చేస్తుండగా ఒక టికెట్‌పై అనుమానం వచ్చి టిటిడి విజిలెన్స్ అధికారులు విచారణ చేప‌ట్టారు. ఇందులో దళారి విశ్వశాంతి కుమార్ కర్నూలుకు చెందిన‌ ఓ ప్రజాప్రతినిధి లేఖను ఫోర్జరీ చేసి హైదరాబాద్‌కు చెందిన శ్రీ బి.పవన్ కుమార్‌కు బ్రేక్ టికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. శ్రీ బి.పవన్ కుమార్‌తో పాటు 5 మందికి రూ.10000/- ద‌ళారి డిమాండ్ చేసిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఇందులో భాగంగా ముందు రూ. 5500/- క్యాష్‌, దర్శనం తర్వాత మిగిలి డ‌బ్బులు ఫోన్‌పే ద్వారా మోసం చేశార‌న్నారు.

దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ PSలో Cr.no 18/2022 u/s 420,468,471 IPC లో క్రింద కేసు నమోదైంది.

టిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.