టిటిడి మహిళా ఉద్యోగులకు సంగీతం, వ్యాసరచన పోటీలు
టిటిడి మహిళా ఉద్యోగులకు సంగీతం, వ్యాసరచన పోటీలు
తిరుపతి, 2019 మార్చి 05: టిటిడి మహిళా ఉద్యోగులకు మంగళవారం తిరుపతిలోని ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంగీతం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. టిటిడి సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. పలువురు మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహతి కళాక్షేత్రంలో జరుగనున్న కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వైవిఎస్.పద్మావతి, ఎస్వీ ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.