అక్టోబరు 1వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘కాసుల కోసం పచ్చదనం హరీ!’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

అక్టోబరు 1వ తేదీన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ‘కాసుల కోసం పచ్చదనం హరీ!’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

తిరుపతి, 2012 అక్టోబరు 01: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానములు ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న ఆర్యోక్తిని తూ.చ తప్పకుండా పాటిస్తోంది. అటు తిరుమలలో ఇటు తిరుపతిలో పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. కాగా తిరుపతి నగరంలోని అలిపిరి నుండి తిరుచానూరు వరకు ఉన్న రోడ్డు డివైడర్‌ను 2002-03వ సంవత్సరంలో నిర్మించి కొన్ని రకాల మొక్కలు, గడ్డి పెంచారు. ఈ పది సంవత్సరాల కాలంలో డివైడర్‌లోని మట్టి సారవంతం కోల్పోవడంతో మొక్కలు ఎండిపోయాయి. పిచ్చిమొక్కలు పెరిగి డివైడర్లు అందవిహీనంగా దర్శనమిస్తున్నాయి.

కలుపుమొక్కలను తొలగించేందుకు 4 ఇంచుల లోతున మట్టి తీసివేయాల్సి వచ్చింది. అదేవిధంగా కొన్ని పిచ్చిమొక్కలు, ఆకృతికి మించి పెరిగిన మొక్కలను(ఓవర్‌ గ్రోన్‌) తొలగించి సారవంతమైన మట్టి, ఎరువులతో డివైడర్లను నింపి అందమైన మొక్కలతో, కార్పెట్‌ గ్రాస్‌తో నింపి బ్రహ్మోత్సవాలలోపు అభివృద్ధి చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవడమైనది. ఇందులో భాగంగా అలిపిరి నుండి కపిలతీర్థం వరకు గల డివైడర్‌లోని ఎండిపోయిన మరియు ఎండిపోతున్న అశోకచెట్లను తొలగించడం జరుగుతోంది. ఇది కూడా ఆధునికీకరణలో ఒక భాగమే. అదేవిధంగా సదరు వార్తలో బినామీలకు నామినేషన్‌కు పనులు అప్పజెప్పినట్టు పేర్కొనడం కేవలం అవాస్తవాలతో కూడిన ఆరోపణ మాత్రమే.

కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
 తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి