అక్టోబ‌రు 30న అద్దంకిలో శ్రీ పురంద‌ర దాసు, శ్రీ అన్న‌మాచార్యుల‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ఠా మ‌హోత్స‌వాలు

అక్టోబ‌రు 30న అద్దంకిలో శ్రీ పురంద‌ర దాసు, శ్రీ అన్న‌మాచార్యుల‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ఠా మ‌హోత్స‌వాలు

తిరుపతి, 2019 అక్టోబ‌రు 29: టిటిడి దాస సాహిత్యప్రాజెక్టు మ‌రియు ప్ర‌కాశం జిల్లా అద్దంకికి చెందిన శ్రీ దాసభార‌తీయ జాన‌ప‌ద క‌ళాక్షేత్రం సంయుక్త ఆధ్వ‌ర్యంలో అక్టోబ‌రు 30న శ్రీ పురంద‌ర దాసుల‌వారు, శ్రీ అన్న‌మాచార్యుల‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ఠా మ‌హోత్స‌వాన్ని బుధ‌వారం వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా శ్రీ ప్ర‌కాశం ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో బుధ‌వారం ఉద‌యం 6.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు పురంద‌రన‌మ‌నం కార్యాక్ర‌మం ఘ‌నంగా జ‌రుగ‌నుంది. ఇందులో పురంద‌ర దాసు, అన్న‌మ‌య్య జీవిత చ‌రిత్ర‌, వారు ర‌చించిన కీర్త‌న‌లు ప్ర‌ముఖ క‌ళాకారులు ఆల‌పించ‌నున్నారు. అనంత‌రం ఉద‌యం 8.00 గంట‌ల‌కు శ్రీ పురంద‌ర దాసుల‌వారి, శ్రీ అన్న‌మాచార్యుల‌వారి విగ్ర‌హాల‌కు అభిషేక‌ము, పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.
   
అనంత‌రం మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల నుండి దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో అద్దంకి ప‌ట్ట‌ణంలోని రామ్‌న‌గ‌ర్ నుండి అద్దంకి పంచాయ‌తీ కార్యాల‌యం వ‌ర‌కు శోభాయాత్ర నిర్వ‌హించ‌నున్నారు. త‌రువాత సాయంత్రం 5.00 గంట‌ల‌కు అద్దంకి న‌గ‌ర పంచాయ‌తీ కార్యాల‌యం ఎదురుగా ప్ర‌ముఖుల‌తో  శ్రీ పురంద‌ర దాసుల‌వారు, శ్రీ అన్న‌మాచార్యుల‌వారి విగ్ర‌హా ఆవిష్క‌ర‌ణ‌ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

కాగా,   శ్రీ ప్ర‌కాశం ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.00 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి ఊంజ‌ల‌సేవ, పుష్ప‌యాగం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.