SRIVANI TRUST GARNERING HUGE RESPONSE FROM PILGRIMS-IN-CHARGE EO _ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌ల విశేష ఆద‌ర‌ణ : టిటిడి ఇన్‌చార్జి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 29 Oct. 19: The newly launched Sri Venkateswara Alaya Nirmana Trust (SRIVANI) has been garnering good reception from the pilgrims as they are not only benefiting from Protocol VIP darshan but also donating their bit in the spread of Hindu Sanatana Dharma which is the chief motto behind the launch of the Trust, asserted the In-charge EO Sri AV Dharma Reddy.

After three-hour long review meeting with different Heads of various departments in Tirumala at Annamaiah Bhavan on Tuesday, the In-charge EO of TTD speaking to media persons said, that the development works which are under progress have been discussed in detail during the review meeting. 

He also said, the response to SRIVANI Trust has been increasing day by day. Today about 89 pilgrims had darshan of Lord. Upon their request we are considering linking of accommodation as soon as the on-line application of SRIVANI Trust is launched in November. 

The In-charge EO told that the GMR Group has come forward to take up the beautification of Tirumala by developing greenery on Donation basis. In the next four months, they have informed us to develop the medians in Tirumala and remaining works in a phased manner.

Apart from this, the MAP Technologies of Bengaluru have taken up the prestigious revamping of Sri Venkateswara Museum at Tirumala and the Temple Experience of the gallery in the underground is already under progress. “The entire project may also cost around Rs.30-40crores which will be also completed on donation basis”, he maintained.

Adding further he said, total plastic ban will be observed in Tirumala from Sankranti festival onwards next year. “I have already instructed the Health Officer to organise an awareness meeting with the Eating establishments in Tirumala. Even the rest houses should be replaced with water dispensers soon. Wide publicity will be given in SVBC on the plastic ban for the information of pilgrim public”, he maintained.

On Cashless transactions, the In-charge EO said, MBC recorded cent percent, Padmavathi area 97% and the Sapthagiri Area and CRO 81%. “We are requesting the pilgrims to encourage cashless transactions, as it will benefit them to refund the Caution Deposit directly into their account”, he observed.

Additional FACAO Sri Balaji, Additional CVSO Sri Siva Kumar Reddy, SE 2 Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, Temple DyEO Sri Harindranath, Reception DyEOs Sri Balaji, Sri Damodar, Parakamani DyEO Sri Venkataiah, GM IT Sri Sesha Reddy and other senior officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌ల విశేష ఆద‌ర‌ణ :  టిటిడి ఇన్‌చార్జి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

అక్టోబ‌రు 29, తిరుమల, 2019: శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణం కోసం టిటిడి ప్రారంభించిన శ్రీవాణి ట్ర‌స్టుకు దాత‌ల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని టిటిడి ఇన్‌చార్జి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

స‌మావేశం అనంత‌రం ఇన్‌చార్జి ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళం అందించిన 89 మంది దాత‌లు మంగ‌ళ‌వారం శ్రీ‌వారి బ్రేక్ ద‌ర్శ‌నం చేసుకున్న‌ట్టు తెలిపారు. ఈ ట్ర‌స్టుకు విరాళ‌మందించే దాత‌ల కోరిక మేర‌కు వ‌కుళాదేవి విశ్రాంతి గృహంలో 50 గ‌దుల‌ను బ‌స కోసం కేటాయించిన‌ట్టు వివ‌రించారు. తిరుమ‌ల‌కు ఒక సంవ‌త్స‌రానికి స‌రిప‌డా నీటి నిల్వ‌లు ఉన్నాయ‌ని, న‌వంబ‌రు, డిసెంబ‌రు నెల‌ల్లో వ‌ర్షాలు కురిస్తే జ‌లాశ‌యాలు నిండుతాయ‌ని తెలియ‌జేశారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఆదేశాల మేర‌కు రానున్న మూడు నెల‌ల్లో తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ నిషేధానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్టు చెప్పారు. దుకాణాల్లో ప్లాస్టిక్‌ బాటిళ్ల‌ను విక్ర‌యించ‌కుండా, వ‌స‌తి గ‌దుల్లో యాత్రికులు, టిటిడి కార్యాల‌యాల్లో ఉద్యోగులు నీళ్ల బాటిళ్ల‌ను వినియోగించ‌కుండా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. ప్లాస్టిక్ నిషేధంపై భ‌క్తుల‌కు అవ‌గాహ‌న పెంచేందుకు ఎస్వీబీసీలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తామ‌న్నారు.

బెంగ‌ళూరుకు చెందిన మాప్ టెక్నాల‌జీస్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి తిరుమ‌ల‌లోని ఎస్వీ మ్యూజియాన్ని అభివృద్ధి చేస్తోంద‌ని ఇన్‌చార్జి ఈవో తెలిపారు. శ్రీ‌వారి ఆల‌యాన్ని ద‌ర్శించిన అనుభూతిని భ‌క్తుల‌కు క‌ల్పించేందుకు మ్యూజియంలో ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. రూ.30 కోట్ల నుండి రూ.40 కోట్ల మ‌ధ్య ఖ‌ర్చు అయ్యే ఈ ప్రాజెక్టు ప‌నుల‌ను మాప్ టెక్నాల‌జీస్ సంస్థ పూర్తి విరాళంగా చేప‌డుతోంద‌న్నారు. వ‌స‌తి గ‌దుల వ‌ద్ద న‌గ‌దు ర‌హిత లావాదేవీలు బాగా జ‌రుగుతున్నాయ‌న్నారు. ప‌ద్మావ‌తి ప్రాంతంలో 97 శాతం, ఎంబిసిలో 100 శాతం, సిఆర్వో వ‌ద్ద 81 శాతం న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. జిఎంఆర్ సంస్థ విరాళంగా తిరుమ‌ల‌లో ఉద్యాన‌వ‌నాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింద‌న్నారు. రానున్న 20 రోజుల్లో జిఎంఆర్ బృందం తిరుమ‌ల‌లోని ఉద్యాన‌వ‌నాల‌ను, అన్ని కూడ‌ళ్ల‌ను సుంద‌రంగా తీర్చిదిద్దుతుంద‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఎఫ్ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి, శ్రీ దామోద‌ర్‌, ప‌ర‌కామ‌ణి డెప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.