SRI PAT GEARS UP FOR NAVARATRI UTSAVAMS _ అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

TIRUPATI, 05 OCTOBER 2021: Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor has geared up to observe Navarathri Utsavams in the temple from October 7 to 15 in Ekantam.

 

Every day there will be Snapana Tirumanjanam between 2.30 pm and 4 pm in the temple in connection with this festival. Unjal Seva will also be observed on these days between 7 pm and 8 pm every day. On October 15 there will be a procession of Ammavaru on Gaja Vahanam.

 

TTD has cancelled all Arjitha Sevas in view of this Navahnika Utsavam.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2021 అక్టోబ‌రు 05: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రతిరోజూ మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4 గంట‌ల వ‌ర‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 15వ తేదీనాడు ఆల‌యంలో గజ వాహనంపై అమ్మ‌వారిని వేంచేపు చేసి ఆస్థానం చేప‌డ‌తారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా అన్ని ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.