EO INSPECTS DEVELOPMENT WORKS LINES UP FOR INAUGURATION ON G-DAY _ ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

TIRUPATI, 05 OCTOBER 2021: TTD EO Dr KS Jawahar Reddy has inspected all the development works in Tirupati on Tuesday, which are lined up for inauguration by Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on October 11.

 

As a part of this, the EO first inspected the roof top works of the Alipiri footpath followed by Gomandiram which is constructed near Alipiri Padala Mandapam. He also visited Go Puja, Go Tulabharam and Go Vignana Kendram set up here and inspected the ongoing works which are under completion. He made some suggestions with respect to wiring, lighting arrangements to the officials concerned and directed them to complete immediately.

 

Later he reviewed on the opening arrangements made for the Paediatric-Cardiac Hospital with the BIRRD officials in his chamber at TTD Administrative Building. He instructed them to develop a 3-minute length video to show it to Honourable CM on the day of inauguration. He also directed them to keep ready a sufficient number of doctors and para-medical staff.

 

JEO Sri Veerabrahmaiah, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, CMO Dr Muralidhar, CSRMO Sri Seshasailendra, BIRRD SO Dr Reddeppa Reddy, Dr Srinath were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 05: బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా ప్రారంభోత్స‌వాలు జ‌రుగ‌నున్న ప్ర‌దేశాల‌ను, అక్క‌డి ఏర్పాట్ల‌ను ఇంజినీరింగ్‌, భ‌ద్ర‌తా అధికారుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప‌రిశీలించారు.

ముందుగా అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో నిర్మాణం పూర్త‌యిన పైక‌ప్పును ప‌రిశీలించారు. అనంత‌రం అలిపిరి పాదాల మండపం వ‌ద్ద ప‌నులు పూర్త‌యిన‌ గోమందిరంలో గోపూజ‌, గోతులాభారం, గోవిజ్ఞాన కేంద్రం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. గోమందిరం లోప‌లికి వెళ్లేందుకు, వెలుప‌లికి వ‌చ్చేందుకు జ‌రుగుతున్న రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. లైటింగ్‌, వైరింగ్ త‌దితర ప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

అనంత‌రం ఎస్వీ పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వ ఏర్పాట్ల‌పై ఈవో తన ఛాంబ‌ర్‌లో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఆసుప‌త్రి వివ‌రాల‌తో మూడు నిమిషాల నిడివి గ‌ల వీడియో త‌యారు చేయాల‌ని బ‌ర్డ్ అధికారుల‌ను ఆదేశించారు. ఆసుప‌త్రిలో త‌గినంత మంది వైద్య సిబ్బంది, పారామెడిక‌ల్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ శ్రీ జ‌గదీశ్వ‌ర్‌రెడ్డి, సిఎంఓ డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌, సిఎస్ ఆర్ఎంవో శ్రీ శేష‌శైలేంద్ర‌, ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ ఆర్‌.రెడ్డెప్ప‌రెడ్డి, డాక్ట‌ర్ శ్రీ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.