JEO (H&E) INSPECTS AKSHAYA KSHETRAM _ అక్షయ క్షేత్రం కేంద్రాలను పరిశీలించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 25 APRIL 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi visited the rehabilitation centre for the mentally retarded children-Akshaya Kshetram located in Renigunta Road on Tuesday.

She interacted with the children and organisers and also verified the facilities including special training wards being provided to them.

Speaking on the occasion she said TTD has been providing financial aid of Rs.15lakhs to Akshaya Kshetram till Covid. Those who have mental disorders in Tirupati and Tirumala are being sent to this rehabilitation centre for proper treatment and training.

A report will be submitted to TTD EO Sri AV Dharma Reddy for taking a decision on resuming financial support to the institution.

DEO Sri Bhaskar Reddy, PRO Dr T Ravi, Balamandir AEO Smt Ammulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్షయ క్షేత్రం కేంద్రాలను పరిశీలించిన జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 25 ఏప్రిల్ 2023: రామచంద్రాపురం మండలంలోని దుర్గ సముద్రం, రేణిగుంట లో ఉన్న అక్షయ క్షేత్రం మానసిక వికలాంగుల, ప్రత్యేక అవసరాలు కల వారి సేవా కేంద్రాలను టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి మంగళవారం సందర్శించారు.

ఈ సందర్భంగా జేఈవో ఆ కేంద్రాల్లో సేవలు పొందుతున్న వారిని చూశారు. కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, అక్షయ కేంద్రానికి టీటీడీ ఏడాదికి రూ 15 లక్షల మేరకు ఆర్థిక సహాయం చేసేదన్నారు. కోవిడ్ ప్రబలినప్పటి నుండి ఈ సహాయం నిలిపి వేసినట్లు ఆమె తెలిపారు. తిరుమల, తిరుపతి లోని మానసిక వికలాంగులు, ప్రత్యేక అవసరాలున్న వారిని ఈ కేంద్రాలకు తరలించి సేవలు అందిస్తున్నారని ఆమె చెప్పారు. ఇక్కడి పరిస్థితిలను పరిశీలించి ఈవో కు నివేదిక అందిస్తామని, ఆర్థిక సహాయం పునరుద్ధరణ కు సంబంధించి ఆయన నిర్ణయం తీసుకుంటారని జేఈవో వివరించారు.

డిఈవో శ్రీ భాస్కర రెడ్డి,పిఆర్వో డాక్టర్ రవి, బాల మందిరం ఎ ఈవో శ్రీ అమ్ములు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది