SGS TO BE AUTONOMOUS-TTD JEO (H&E) _ అటానమస్ దిశగా ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల- టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 25 APRIL 2023: TTD-run Sri Govindaraja Swami Arts college which has achieved NAAC A+ grade in its first attempt itself, is now stepping ahead to become autonomous, said TTD JEO for Health and Education Smt Sada Bhargavi.

 

In connection with this remarkable achievement a “Get Together” was organised at SGS Arts College in Tirupati on Tuesday to which the JEO graced the event as chief guest. Speaking on the occasion, the JEO said, post Covid, the NAAC team visited the college and got impressed with the quality of education, infrastructure and environment in the premises and was given the NAAC A+ grade in its maiden attempt. “I appreciate and compliment the team work of the Principal and the teaching and non-teaching faculty, students and hard work of Devasthanams Education Officer”, she said. 

 

She also said an art gallery with temple architecture was also commenced in the college premises. She also appreciated the participation of Walkers’ Association, Pensioners’ Association who felicitated the SGS faculty on their achievement. The JEO said that the former DEO of TTD and the present services DyEO Sri Govindarajan and PRO Dr T Ravi also happen to be the old students of this coveted college and advised them to contribute for the development of the institution along with other old students. 

       

DEO Sri Bhaskar Reddy, Principal Sri Venugopal Reddy, retired DyEO Sri Prabhakar Reddy, other principals were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అటానమస్ దిశగా ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల

– టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 25 ఏప్రిల్ 2023: మొదటి ప్రయత్నంలోనే న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ సాధించిన శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల అటానమస్ దిశగా అడుగులు వేయాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి కోరారు. తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ వచ్చిన సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని డిగ్రీ కళాశాలలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ లభించడం సంతోషకరమన్నారు. కోవిడ్ తర్వాత న్యాక్ బృందం కళాశాలను సందర్శించిందని, ఇక్కడి మౌలిక వసతులను గుర్తించి ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు అందించిందని చెప్పారు. ఇందుకు కృషి చేసిన డిఈవో , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు

కళాశాలలో ఆలయ శిల్పకళ, ఆలయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించినట్టు తెలిపారు. ఆత్మీయ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ అసోసియేషన్ పాల్గొని అధ్యాపకులను అభినందించడం సంతోషకరమన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులైన డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, పిఆర్వో డా. టి.రవి తదితరులు కలిసి కళాశాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిఈవో డా. ఎం.భాస్కర్ రెడ్డి, ఎస్జీఎస్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ రెడ్డితోపాటు టీటీడీలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.